బాధిత కుటుంబాలను ఆదుకుంటాం: మంత్రి నారా లోకేశ్
ABN , Publish Date - Oct 16 , 2026 | 07:23 PM
ఏపీలోని సత్యసాయి జిల్లా గొల్లపల్లి రిజర్వాయర్లో స్నానం చేస్తూ నీట మునిగి ఐదుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అమరావతి, అక్టోబర్ 16: శ్రీ సత్యసాయి జిల్లాలో రిజర్వాయర్లో స్నానం చేసేందుకు నీటిలోకి దిగిన ఐదుగురు మహిళలు ప్రమాదవశాత్తూ నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహిళలు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. మృతులకు నివాళులర్పిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు.
ఒకే ఘటనలో ఐదుగురు మహిళలు ప్రాణాలు కోల్పోవడం వారి కుటుంబాలకు తీరని లోటని, ఈ విషాదాన్ని మాటల్లో వర్ణించలేమని పేర్కొంటూ బాధిత కుటుంబాలకు మంత్రి లోకేశ్ సానుభూతి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజకీయ ప్రమేయం లేకుండా రిజర్వేషన్లు.. అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం: మంత్రి నారాయణ
స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకని దిక్కుతోచని స్థితిలో గొడ్డలి పార్టీ: మంత్రి కొల్లు రవీంద్ర
ఏపీకి భారీగా పెట్టుబడులు.. త్వరలో మూడు ప్రాంతాల్లో సదస్సులు
Read Latest AP News And Telangana News