Share News

రాజకీయంగా ఎదుర్కోలేకే వైసీపీ నిరసనలు: మంత్రి నాదెండ్ల మనోహర్

ABN , Publish Date - Sep 24 , 2026 | 03:43 PM

వైసీపీ నిరసనలపై మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్రంగా స్పందించారు. రాజకీయంగా ఎదుర్కోలేకే అలజడి సృష్టిస్తున్నారని విమర్శించారు. ఆధారాలతో అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సూచించారు. వివరాల్లోకి వెళితే..

రాజకీయంగా ఎదుర్కోలేకే వైసీపీ నిరసనలు: మంత్రి నాదెండ్ల మనోహర్
Nadendla Manohar Latest News

అమరావతి, సెప్టెంబర్ 24: రాజకీయంగా కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక వైసీపీ అరాచక శక్తులతో నిరసనలు నిర్వహిస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించేలా వ్యవహరించడం సరికాదన్నారు. రాజకీయ అంశాలను రాజకీయంగానే ఎదుర్కోవాలని.. ఆధారాలతో అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సూచించారు. విజయవాడలో ప్రశాంతంగా నిరసన తెలిపే అవకాశం ఉన్నప్పటికీ రౌడీషీటర్లను రంగంలోకి దించి అస్తవ్యస్త పరిస్థితులు సృష్టించారని విమర్శించారు. ఐదారు జిల్లాల నుంచి వ్యక్తులను తీసుకొచ్చి రోడ్లపై అలజడి సృష్టించడం సరికాదని అన్నారు.


ఏపీపీఎస్సీ వ్యవహారాలపై ప్రభుత్వం విచారణ జరుపుతోందని.. కొన్ని అంశాలు న్యాయస్థానాల పరిధిలో ఉన్నాయని నాదెండ్ల మనోహర్ తెలిపారు. జగన్‌రెడ్డికి డీఎస్సీ, ఏపీపీఎస్సీ మధ్య తేడా కూడా తెలియదని విమర్శించారు. కొవిడ్‌ సమయంలో ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద నిలబెట్టిన విషయాన్ని మర్చిపోవద్దని.. గురువులను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ నాయకుడిపైనా ఉందన్నారు. జగన్‌ హయాంలో మద్యం వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో ప్రజలకు తెలుసని, నాసిరకం మద్యం కారణంగా సుమారు 30 వేల కుటుంబాలు నష్టపోయాయని ఆరోపించారు. దర్యాప్తుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే నిరసనలు చేపడుతున్నారని మంత్రి విమర్శించారు.


ఇవీ చదవండి:

కొడుకు అరెస్టుతో తండ్రి నేర చరిత్ర వెలుగులోకి.!

బిహార్‌లో దారుణం.. మరో బాలికపై లైంగిక వేధింపులు

Updated Date - Sep 24 , 2026 | 05:30 PM