Share News

ఏపీని ఏవియేషన్ హబ్‌గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం: కేంద్ర మంత్రి రామ్మోహన్

ABN , Publish Date - Sep 26 , 2026 | 04:18 PM

ఏపీని ఏవియేషన్ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

ఏపీని ఏవియేషన్ హబ్‌గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం: కేంద్ర మంత్రి రామ్మోహన్
central minister rammohan naidu on fto's in ap

కర్నూలు, సెప్టెంబర్ 26: ఏపీని ఏవియేషన్ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకేస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో ఫైయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు.


రాష్ట్రంలోని కర్నూలు, కడప, రాజమండ్రిలోని విమానాశ్రయాలలో ఈ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇప్పటికే కర్నూలు విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించామని.. మిగతా సెంటర్లను కూడా త్వరలో అందుబాటులోకి తెస్తామని ఆయన అన్నారు. ఇవే కాకుండా రాష్ట్రంలో మరికొన్ని ఎఫ్‌టీవో( ఫైయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్)లను తీసుకొస్తానని మంత్రి హామీ ఇచ్చారు.


యువత ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలి: కేంద్ర మంత్రి రామ్మోహన్

రాష్ట్రంలో ఏవియేషన్ అకాడమీల ఏర్పాటు వల్ల యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కేంద్రమంత్రి రామ్మోహన్ అన్నారు. ఏవియేషన్‌ రంగంలో యువతకు విస్తృత అవకాశాలున్నాయని.. ఈ మేరకు యువత ఏవియేషన్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాయలసీమ అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ఇప్పటికే కర్నూలు‌లో భారతదేశంలోనే తొలి డ్రోన్ సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు. దీంతోపాటు కర్నూలులో ఉన్న ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేస్తే.. ఓర్వకల్ అభివృద్ధికి తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Sep 26 , 2026 | 05:01 PM