Share News

సామాన్యుడికి మేయర్‌ పీఠం!

ABN , Publish Date - Nov 16 , 2026 | 12:44 AM

కీలక పదవులు ఆర్థిక బలం, రాజకీయ పలుకుబడి ఉన్నవారికే దక్కుతాయనే అభిప్రాయం తప్పని టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి లోకేశ్‌ నిరూపించారు.

సామాన్యుడికి మేయర్‌ పీఠం!

  • మంగళగిరి-తాడేపల్లి మేయర్‌ అభ్యర్థిగా సాధారణ కార్యకర్త ఏడుకొండలు

  • మంత్రి లోకేశ్‌ సంచలన నిర్ణయం

మంగళగిరి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): కీలక పదవులు ఆర్థిక బలం, రాజకీయ పలుకుబడి ఉన్నవారికే దక్కుతాయనే అభిప్రాయం తప్పని టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి లోకేశ్‌ నిరూపించారు. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టకాలంలోనూ జెండా మోస్తూ, నిస్వార్థంగా పనిచేసిన కార్యకర్తల శ్రమను గుర్తించాలనే ఉద్దేశంతో.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఓ సామాన్య కార్యకర్త పేరం ఏడుకొండలును మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్‌ మేయర్‌ అభ్యర్థిగా ప్రకటించారు. తాజా ఎన్నికల్లో రొటేషన్‌ ప్రకారం ఈ కార్పొరేషన్‌ ఎస్టీలకు రిజర్వ్‌ అయింది. ఈ వర్గానికి చెందిన విద్యాధిక కుటుంబాలు ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నాయి.

వారందరినీ కాదని అనూహ్యంగా మంగళగిరి గండాలయపేటకు చెందిన సామాన్య కార్యకర్త పేరం ఏడుకొండలు పేరును పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. అట్టడుగు నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన మామూలు కార్యకర్తకు.. రాజధాని అమరావతి పరిధిలో మేయర్‌ వంటి అత్యున్నత పదవిని కట్టబెట్టాలని లోకేశ్‌ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది. తద్వారా.. పార్టీ కోసం పనిచేసే వారికి తగిన సమయంలో సముచిత, గుర్తింపు, గౌరవం లభిస్తాయనే భరోసా కల్పించినట్లయింది. మొత్తంగా ఈ పరిణామం మంగళగిరి రాజకీయ చరిత్రలో ప్రత్యేక ఘట్టంగా నిలవనుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

సొంత వైద్యం.. ప్రాణాలకే ముప్పు

ఏపీలో జోరుగా పంచాయతీ ఎన్నికల నామినేషన్లు..!

Updated Date - Nov 16 , 2026 | 12:48 AM