Share News

కూటమి విజయం మింగుడు పడకే విమర్శలు: అచ్చెన్న

ABN , Publish Date - Nov 04 , 2026 | 01:44 AM

‘జగన్‌... నాడు ఈవీఎంలపై నిందలు వేసి బ్యాలెట్‌ పద్ధతి కావాలన్నావు. నేడు బ్యాలెట్‌ పద్ధతిలో జరిగి న స్థానిక ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధించడంతో ఎన్నికల నిర్వహణనే తప్పుబట్టడం విడ్డూరంగా ఉంది’ అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

కూటమి విజయం మింగుడు పడకే విమర్శలు: అచ్చెన్న

శ్రీకాకుళం, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): ‘జగన్‌... నాడు ఈవీఎంలపై నిందలు వేసి బ్యాలెట్‌ పద్ధతి కావాలన్నావు. నేడు బ్యాలెట్‌ పద్ధతిలో జరిగి న స్థానిక ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధించడంతో ఎన్నికల నిర్వహణనే తప్పుబట్టడం విడ్డూరంగా ఉంది’ అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళవారం ఓ ప్రకటన చేశారు. ‘2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం 93 శాతం విజయాన్ని నమోదు చేసింది. నేడు స్థానిక ఎన్నికల్లో నూరు శాతం విజయం సాధించడం జగన్‌కు మింగుడుపడటం లేదు. అందుకనే సిగ్గులేకుండా కూటమి ప్రభుత్వంపై దిగజారుడు విమర్శ లు చేస్తున్నారు. ఓటమికి కారణాలు విశ్లేషించుకోకుండా ఎన్నికల వ్యవస్థలను తప్పుబట్టడం మానుకోవాలి. నామినేషన్ల నుంచి కౌంటింగ్‌ వరకు ఎన్నికలను హైజాక్‌ చేశారంటున్న జగన్‌, తన వ్యాఖ్యలకు ఆధారాలు బయటపెట్టాలి. నామినేషన్లను ఎవరు అడ్డుకున్నారు? పోలింగ్‌ ఏజెంట్లను ఎక్కడ బయటకు పంపించారు? ఓటింగ్‌ శాతాన్ని ఏ కేంద్రంలో మార్చారు? కౌంటింగ్‌లో ఎక్కడ అక్రమాలు జరిగాయి?.. నిర్దిష్ట ఆధారాలుంటే ఎన్నికల సంఘానికి సమర్పించి విచారణ కోరాలి. మాజీ సీఎంగా ఉండి చొక్కా మడతపెట్టి ‘ఎవరొస్తారో రండి’ అంటూ మాట్లాడటం ద్వారా ప్రజలకు ఏం సంకేతాలు ఇచ్చారు?’ అని అచ్చెన్న నిలదీశారు.

ఈ వార్తలనూ చదవండి:

కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం

కూటమికే.. పట్టణం

Updated Date - Nov 04 , 2026 | 01:44 AM