మార్కాపురం జిల్లాలో కోడి వివాదం.. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య రాళ్ల దాడి
ABN , Publish Date - Nov 21 , 2026 | 08:39 PM
కోడి వివాదం రాజకీయ వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం విశ్వనాథపురంలో టీడీపీ, వైసీపీ వర్గీయులు కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులకు దిగారు.
మార్కాపురం, నవంబరు 21: జిల్లాలోని త్రిపురాంతకం మండలం విశ్వనాథపురంలో కోడి వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ వర్గీయులకు చెందిన కోడిని వైసీపీ వర్గీయుల ట్రాక్టర్ తొక్కిందన్న ఆరోపణతో ఇరువర్గాల మధ్య గొడవ మొదలైంది. ఈ క్రమంలో చిన్నపాటి వివాదం కాస్తా ఘర్షణగా మారింది. ఇరువర్గాలకు చెందిన వారు కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులకు దిగడంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు సమాచారం.
ఘర్షణలో ఓ ఇంటి అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. కోడి విషయంలో మొదలైన వివాదం రాజకీయ వర్గాల మధ్య ఘర్షణకు దారితీయడంతో గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితిని పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రకాశం జిల్లాలో రోడ్డుప్రమాదం.. నలుగురి మృతి
ఎన్టీఆర్ జిల్లాలో పెద్దపులి కలకలం.. తిరువూరు అడవుల్లోకి చేరిన ‘ఎక్స్‌ప్లోరర్’
Read Latest AP News And Telugu News