Share News

చీకటి గోపీ కేసును సీనియర్‌ ఐపీఎస్‌కు అప్పగించాలి

ABN , Publish Date - Sep 12 , 2026 | 05:19 AM

పోలీసుల చిత్రహింసల కారణంగా మృతి చెందిన గుంటూరు జిల్లా తాడికొండ మండలం, పొన్నెకల్లు గ్రామానికి చెందిన చీకటి గోపి కేసును సీనియర్‌ ఐపీఎస్‌ అధికారికి అప్పగించాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు.

చీకటి గోపీ కేసును సీనియర్‌ ఐపీఎస్‌కు అప్పగించాలి

  • బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు ప్రకటించాలి: మంద కృష్ణ మాదిగ

గుంటూరు(తూర్పు), సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): పోలీసుల చిత్రహింసల కారణంగా మృతి చెందిన గుంటూరు జిల్లా తాడికొండ మండలం, పొన్నెకల్లు గ్రామానికి చెందిన చీకటి గోపి కేసును సీనియర్‌ ఐపీఎస్‌ అధికారికి అప్పగించాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు. గుంటూరులో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎలాంటి ఫిర్యాదు లేకుండానే విచారణ పేరుతో గోపితో పాటు మరో ఇద్దరిని పోలీసులు స్టేషన్‌కు పిలిపించి, రెండు రోజులు చిత్రహింసలకు గురిచేశారన్నారు. గోపి మృతిలో సీఐపై మరో సీఐని విచారణ అధికారిగా నియమించడం సరికాదని, ఈ కేసులో నిష్పక్షపాత దర్యాప్తు కోసం ఉన్నతస్థాయి అధికారిని నియమించాలని కోరారు. ఇతర సామాజిక వర్గాల్లో బాధిత కుటుంబాలకు భారీగా పరిహారం, హామీలు ఇస్తున్న ప్రభుత్వం దళిత కుటుంబాలకు మాత్రం అదే స్థాయిలో సహాయం అందించడం లేదని విమర్శించారు. గోపి కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారంతోపాటు, ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్‌ చేశారు. సాయికృష్ణ కుటుంబసభ్యులను సీఎం ఇంటికి పిలిపించుకుని పరామర్శించిన విధంగానే గోపి కుటుంబాన్ని పరామర్శించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే దళిత, ఇతర సంఘాలతో కలిసి ఈ నెల 15 నుంచి జిల్లా కేంద్రాల్లో రౌండ్‌టేబుల్‌ సమావేశాలు నిర్వహిస్తామని మంద కృష్ణ తెలిపారు. గోపి కుటుంబసభ్యులు మాట్లాడుతూ పోలీసుల చిత్రహింసల కారణంగానే గోపి మృతి చెందాడని ఆరోపించారు.

ఈ వార్తలనూ చదవండి...

స్థానిక నాయకత్వం ఆమోదంతోనే చిన్న శ్రీనును పార్టీలోకి తీసుకున్నాం:

ఏపీ 2026-27 ఎక్సైజ్ పాలసీని ప్రకటించిన ఏపీ సర్కార్..

Updated Date - Sep 12 , 2026 | 05:19 AM