చిత్రహింసలతోనే చీకటి గోపి మృతి
ABN , Publish Date - Sep 14 , 2026 | 05:29 AM
పోలీసుల చిత్రహింసల వల్లే గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన చీకటి గోపి మృతి చెందాడని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. మృతుడి కుటుంబసభ్యులతో కలసి ఆదివారం ఆయన రాజధాని అమరావతిలోని తుళ్లూరులో మాట్లాడారు.
చేసిన తప్పును ఎప్పుడూ పోలీసులు ఒప్పుకోరు
రఘురామ విషయంలోనూ అదే జరిగింది
ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
తుళ్లూరు, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): పోలీసుల చిత్రహింసల వల్లే గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన చీకటి గోపి మృతి చెందాడని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. మృతుడి కుటుంబసభ్యులతో కలసి ఆదివారం ఆయన రాజధాని అమరావతిలోని తుళ్లూరులో మాట్లాడారు. గోపి భార్య, అక్క లక్ష్మి, తల్లి మాట్లాడుతూ కొట్టిన విషయం బయటకు చెపితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరించి జ్వరంతో ఉన్న గోపీని తమకు అప్పచెప్పారని తెలిపారు.
అనారోగ్యంతో గోపి చనిపోయాడని పోలీసులు అబద్దాలు ఆడుతున్నారన్నారు. మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ గోపి మృతి ఘటనపై సీనియర్ ఐపీఎస్ అధికారితో లోతైన విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. గోపిని 24 గంటల్లో కోర్టు ముందు ప్రవేశపెట్టకుండా 60 గంటలు పోలీసు కస్టడీలో ఎందుకు ఉంచారని ప్రశ్నించారు. పోలీసులు ఎప్పుడూ తప్పు ఒప్పుకోరన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రస్తుత శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును చిత్రహింసలు పెట్టి, ఆ తర్వాత చేయలేదని అబద్దాలు ఆడారని తెలిపారు. ఆర్థికంగా, రాజకీయంగా బలం ఉండటంతో రఘురామరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో పోలీసుల చిత్రహింసలు బయటకు వచ్చాయన్నారు.
ఈ వార్తలనూ చదవండి..
ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు: కలిశెట్టి
‘డీఎస్సీపై చర్చకు జగన్ సిద్ధమా?’