Share News

మంత్రాలయానికి పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - Jul 12 , 2026 | 11:36 PM

రాఘవేంద్ర స్వామి దర్శ నార్థం వచ్చిన భక్తులతో మంత్రాలయం సందడి గా మారింది.

మంత్రాలయానికి పోటెత్తిన భక్తులు
భక్తులతో కిటకిటలాడుతున్న శ్రీమఠం మధ్వమార్గ్‌ కారిడార్‌

మంత్రాలయం, జూలై 12(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్ర స్వామి దర్శ నార్థం వచ్చిన భక్తులతో మంత్రాలయం సందడి గా మారింది. ఆదివారం సెలవుదినం కావడంతో దక్షణాది రాష్ర్టాలైన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి వే లాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో అన్నపూర్ణ భోజనశాల, మహాముఖద్వారం, మధ్వమార్గ్‌ కారిడార్‌, ప్రధాన రహదారులు, రాఘవేంద్ర సర్కిల్‌, తుంగభద్ర నది తీరం భక్తులతో కోలాహలంగా మారింది. తుంగభద్ర నదిలో పుణ్య స్నానాలు ఆచరించి గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో ప్రధాన రహదారులు ట్రాఫిక్‌తో అస్థవ్యస్తగా మారింది.

Updated Date - Jul 12 , 2026 | 11:36 PM