Makar Sankranti 2026 : టోల్ వసూళ్లను నిలిపేయండి.. కేంద్రమంత్రికి టీడీపీ ఎంపీ విజ్ఞప్తి..
ABN , Publish Date - Jan 02 , 2026 | 05:19 PM
సంక్రాంతి సందర్భంగా టోల్‌ప్లాజాలో టోల్ వసూళ్లను నిలిపివేయాలంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని టీడీపీ ఎంపీ సనా సతీష్ కోరారు. సంక్రాంతికి హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి లక్షలాది మంది..
అమరావతి, జనవరి 2: సంక్రాంతి సందర్భంగా టోల్‌ప్లాజాలో టోల్ వసూళ్లను నిలిపివేయాలంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని టీడీపీ ఎంపీ సనా సతీష్ కోరారు. సంక్రాంతికి హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి లక్షలాది మంది ఏపీలోని సొంత గ్రామాలకు వస్తారని.. ఫలితంగా హైదరాబాద్-విజయవాడ రహదారిపై విపరీతమైన రద్దీ ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని టోల్ వసూళ్లు నిలిపివేయాలని కేంద్రాన్ని కోరారు.
సంక్రాంతి పండుగ కారణంగా హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ వాసులు పెద్ద ఎత్తున తమ తమ స్వస్థలాలకు వెళ్తుంటారని.. ఫలితంగా హైదరాబాద్-విజయవాడ రహదారిపై తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుందన్నారు ఎంపీ సనా సతీష్. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. పంతంగి, కొర్లపహడ్, చిల్లకల్లు, కీసర టోల్ ప్లాజాల వద్ద విపరీతమైన రద్దీ ఏర్పడి గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోతుందన్నారు. ఈ కారణంగా తెలుగు ప్రజలకు సమయం ఆదా అవ్వడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు టోల్‌ప్లాజాల వద్ద టోల్ వసూళ్లను మాఫీ చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు ఎంపీ సనా సతీష్. దీని వలన ప్రయాణం సాఫీగా జరిగి ఇళ్లకు క్షేమంగా చేరుకుంటారని అన్నారు. సంక్రాంతి పండుగను అందరూ సాంప్రదాయ బద్దంగా జరుపుకునేందుకు అవకాశం కలుగుతుందని.. తమ విజ్ఞప్తిని పరిశీలించాలంటూ కేంద్ర మంత్రిని కోరారు ఎంపీ.
Also Read:
Fire in Army Camp Store: ఆర్మీ క్యాంపులో భారీ అగ్నిప్రమాదం
Ponnam Prabhakar: రోడ్డు ప్రమాదాల నివారణకు సర్కార్ నయా ప్లాన్
Leopard Spotted: శ్రీశైలంలో చిరుత కలకలం.. ఓ ఇంటి ఆవరణలోకి వచ్చి..