Leopard Spotted: శ్రీశైలంలో చిరుత కలకలం.. ఓ ఇంటి ఆవరణలోకి వచ్చి..
ABN , Publish Date - Jan 02 , 2026 | 04:42 PM
శ్రీశైలంలో చిరుత పులి కలకలం సృష్టించింది. గురువారం అర్ధరాత్రి ఓ చిరుత సత్యనారాయణ ఇంటి ఆవరణలోకి చొరబడింది. అది ఆహారం కోసం ఇంటి ఆవరణలో కలియతిరిగింది. ఏమీ దొరక్కపోవటంతో అక్కడినుంచి వెళ్లిపోయింది.
పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలంలో చిరుత పులి కలకలం సృష్టించింది. ఓ ఇంటి ప్రాంగణంలోకి చొరబడింది. ఇంటి ఆవరణలో ఆహారం కోసం అటు, ఇటు తిరిగి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సత్యనారాయణ అనే వ్యక్తి పాతాళగంగ మెట్లవైపు రేకుల షెడ్డు ఇల్లు కట్టుకుని జీవిస్తున్నాడు. ఆ ప్రాంతంలో చిరుతపులి తిరుగుతోందని సత్యనారాయణకు తెలిసింది. అప్రమత్తంగా ఉండేందుకు ఇంటి ఆవరణలో సీసీ టీవీ కెమెరాలు పెట్టించాడు. ఈ నేపథ్యంలోనే గురువారం అర్ధరాత్రి ఓ చిరుత సత్యనారాయణ ఇంటి ఆవరణలోకి చొరబడింది.
అది ఆహారం కోసం ఇంటి ఆవరణలో కలియతిరిగింది. ఏమీ దొరక్కపోవటంతో అక్కడినుంచి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సత్యనారాయణ ఇంటి దగ్గరకు చిరుత రావటం ఇది మొదటి సారి కాదు.. ఇంతకు ముందు ఓ సారి వచ్చింది. కృష్ణానది తీరం కావటంతో చిరుతలు పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో సంచరిస్తున్నాయి. నల్లమల్ల అడవుల్లో ప్రస్తుతం 87 పెద్ద పులులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
న్యూ ఇయర్ రోజు విషాదం.. హోటల్‌లో శవమై తేలిన నటుడి కూతురు
ఈ విషయాలను బంధువులతో అస్సలు పంచుకోకండి..