Share News

థింసా డ్యాన్స్‌ నెవర్‌ బిఫోర్‌.. ఎవర్‌ ఆఫ్టర్‌: లోకేశ్‌

ABN , Publish Date - Aug 02 , 2026 | 09:07 AM

‘భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా వేలాది మంది విద్యార్థినులు, మహిళలు ప్రదర్శించిన థింసా డ్యాన్స్‌ నెవర్‌ బిఫోర్‌.. ఎవర్‌ ఆఫ్టర్‌’ అని మంత్రి లోకేశ్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు.

థింసా డ్యాన్స్‌ నెవర్‌ బిఫోర్‌.. ఎవర్‌ ఆఫ్టర్‌: లోకేశ్‌
Nara Lokesh

అమరావతి (ఆంధ్రజ్యోతి): ‘భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా వేలాది మంది విద్యార్థినులు, మహిళలు ప్రదర్శించిన థింసా డ్యాన్స్‌ నెవర్‌ బిఫోర్‌.. ఎవర్‌ ఆఫ్టర్‌’ అని మంత్రి లోకేశ్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘ప్రధాని మోదీ మనస్సు గెలిచిన థింసా నృత్యం చేసిన వేలాదిమంది అక్కాచెల్లెళ్లకు, నేర్పిన గురువులకు హృదయపూర్వక ధన్యవాదాలు. వరల్డ్‌ రికార్డు సాధన కృషిలో భాగమైన వారందరికీ కృతజ్ఞతలు. ఉత్తరాంధ్ర చరిత్ర, సంస్కృతి, సంప్రదాయ వారసత్వాన్ని చాటిన మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని పండుగలా, దేశమంతా ఆంధ్రప్రదేశ్‌ వైపు చూసేలా విజయవంతం చేసిన కూటమి నేతలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, సిబ్బంది, మీడియా, జీఎంఆర్‌ యంత్రాంగానికి ధన్యవాదాలు. ఇది సమష్టి కృషి ఫలితం. ఇది ప్రజల విజయం’ అని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

45 నిమిషాల్లో 5 ప్లేట్ల బిర్యానీ తిన్నాడు.. భారీ బహుమతి గెలిచాడు..

సికింద్రాబాద్‌లో లష్కర్ బోనాల సందడి.. తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం

Updated Date - Aug 02 , 2026 | 09:07 AM