Share News

భారతీరాజా కన్నుమూత.. సినీ రంగానికి తీరని లోటు: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jun 10 , 2026 | 02:05 PM

ప్రముఖ దర్శకులు భారతీరాజా మృతిపై సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు. ఆయన మరణం భారతీయ సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అని అన్నారు.

భారతీరాజా కన్నుమూత.. సినీ రంగానికి తీరని లోటు: సీఎం చంద్రబాబు
Bharathiraja passes away

అమరావతి, జూన్ 10: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసి, గ్రామీణ నేపథ్య చిత్రాలకు సరికొత్త ప్రాణం పోసిన ప్రఖ్యాత సినీ దర్శకుడు భారతీరాజా(84) కన్నుమూశారు. భారతీరాజా మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. భారతీరాజా మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా స్పందించారు. 'భారతీరాజా మరణం బాధాకరం. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలకు ఆయన చిరస్మరణీయ చిత్రాలు అందించారు. భారతీయ సినీ రంగానికి ఆయన మరణం తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలను భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను' అని చంద్రబాబు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.


భారతీరాజా కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో చెన్నైలోని తన నివాసంలో నేడు తుదిశ్వాస విడిచారు. భారతీరాజా మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సినిమాను పచ్చని పల్లెటూరి పొలాల్లోకి, సహజత్వానికి దగ్గరగా తీసుకెళ్లిన మొదటి దర్శకుడిగా ఆయన సినీ చరిత్రలో నిలిచిపోయారు. తెలుగు, తమిళ చలనచిత్ర పరిశ్రమలకు భారతీరాజా అందించిన సేవలు చిరస్మరణీయమైనవి. 1977లో '16 వయదినైలే' తెలుగులో పదహారేళ్ల వయసు చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ఆయన, మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ ట్రెండ్‌ను మార్చేశారు.


ఇవి కూడా చదవండి...

బాలకృష్ణకు సీఎం చంద్రబాబు, లోకేశ్ పుట్టినరోజు శుభాకాంక్షలు

యోగా మన జీవితంలో భాగం కావాలి: వసంత కృష్ణప్రసాద్

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 10 , 2026 | 02:12 PM