Share News

మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న కొణిదెల ఉపాసన..

ABN , Publish Date - Sep 17 , 2026 | 12:04 PM

కర్నూలు జిల్లాలో ప్రముఖ సినీ నటుడు రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన కొణిదెల పర్యటించారు. ఈరోజు మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని దర్శించుకుని ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న కొణిదెల ఉపాసన..
Upasana Konidela

కర్నూలు: జిల్లాలో ఇవాళ (గురువారం) ప్రముఖ సినీ నటుడు రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన కొణిదెల పర్యటించారు. ఈ రోజు ఉదయం మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని దర్శించుకుని ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక హెలికాప్టర్‌లో దేవాలయానికి చేరుకున్న ఉపాసనకు ఆలయ అధికారులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు.


ముందుగా గ్రామదేవత మంచాలమ్మను ఉపాసన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి మూలబృందావనాన్ని దర్శించి పూజా, అభిషేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆమె మొక్కులు చెల్లించుకున్నారు. ఉపాసనను మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామి ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామివారి ఆశీస్సులు పొందడం ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు.


మరోవైపు, తమ అభిమాన హీరో రామ్‌చరణ్‌ సతీమణి మంత్రాలయానికి వచ్చిన విషయం తెలుసుకున్న అభిమానులు, భక్తులు ఉపాసనను చూసేందుకు ఆసక్తి కనబరిచారు. దీంతో ఆలయ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి

ఆళ్ల నాని కుటుంబానికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్

విద్యుత్ శాఖపై ఎల్‌నినో ఎఫెక్ట్.. పెరిగిన డిమాండ్: మంత్రి గొట్టిపాటి

Updated Date - Sep 17 , 2026 | 12:04 PM