Share News

వైసీపీ నేతల అరాచకం.. మాజీ ఎమ్మెల్యే కాటసాని సహా పలువురిపై కేసులు నమోదు..

ABN , Publish Date - Aug 14 , 2026 | 09:39 PM

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నిన్న (గురువారం) కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు వీరంగం సృష్టించారు. దీనిపై కర్నూలు జిల్లా పోలీసులు సీరియస్ అయ్యారు.

వైసీపీ నేతల అరాచకం.. మాజీ ఎమ్మెల్యే కాటసాని సహా పలువురిపై కేసులు నమోదు..
Cases on YSRCP Leaders

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నిన్న (గురువారం) కర్నూలు జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. జగన్ పర్యటన సందర్భంగా ఆ పార్టీ నేతలు వీరంగం సృష్టించారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడంతో పాటు ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. దీనిపై కర్నూలు జిల్లా పోలీసులు సీరియస్ అయ్యారు. ఈ మేరకు నిబంధనలు ఉల్లంఘించిన పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు.


కర్నూలు చెన్నమ్మ సర్కిల్‌లో గుంపులుగా వచ్చి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడమే కాకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఆయన అనుచరులపై ఫోర్త్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే బళ్లారి చౌరస్తాలో సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారంటూ మరికొందరిపై కేసు నమోదు చేశారు. కేసులు నమోదైన వారిలో కర్నూలు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ సుభాష్ చంద్రబోస్, ఆయన అనుచరులు ఉన్నారు.


మరోవైపు, జగన్ ర్యాలీలో ‘మేము అధికారంలోకి వస్తే గంగమ్మ జాతరే’ అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించిన తుగ్గలి మండలానికి చెందిన నలుగురు వైసీపీ కార్యకర్తలపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. కేసుల నమోదు నేపథ్యంలో అతి త్వరలోనే వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. కాగా, మాజీ ఎమ్మెల్యేతో పాటు పలువురిపై ఇలా కేసులు నమోదు కావడం జిల్లా రాజకీయాల్లో పెద్దఎత్తున చర్చకు దారి తీసింది.


ఈ వార్తలు కూడా చదవండి

స్వాతంత్ర్య దినోత్సవం వేళ విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్న రాజధాని అమరావతి..

వైసీపీ సభ్యులకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక సూచన

Updated Date - Aug 14 , 2026 | 09:40 PM