స్వాతంత్ర్య దినోత్సవం వేళ విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్న రాజధాని అమరావతి..
ABN , Publish Date - Aug 14 , 2026 | 08:00 PM
స్వాతంత్ర్య దినోత్సవం వేళ రాజధాని అమరావతి ప్రాంతం పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. విద్యుత్ దీపాలతో ఆ ప్రాంతమంతా వెలిగిపోతోంది. ముఖ్యంగా అసెంబ్లీ, సచివాలయ భవనాలను ఎలక్ట్రిక్ లైట్లతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.
అమరావతి: స్వాతంత్ర్య దినోత్సవం వేళ రాజధాని అమరావతి ప్రాంతం పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. విద్యుత్ దీపాలతో ఆ ప్రాంతమంతా వెలిగిపోతోంది. ముఖ్యంగా అసెంబ్లీ, సచివాలయ భవనాలను ఎలక్ట్రిక్ లైట్లతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. విద్యుత్ వెలుగులతో ఆ రెండు ప్రాంతాలు శోభాయమానంగా మారాయి.
మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ప్రతిబింబించేలా సచివాలయంలోని ఐదు భవనాలకు ప్రత్యేకంగా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. అలాగే విద్యుత్ కాంతులతో ఏపీ అసెంబ్లీ భవనం ఆకట్టుకుంటోంది. అసెంబ్లీ, సచివాలయ ప్రాంగణాల్లోని రహదారులకు ఇరువైపులా ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ లైట్లను ఏర్పాటు చేశారు. సెంట్రల్ పార్కులోనూ వివిధ రంగుల విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరణ చేశారు. మరోవైపు, విజయవాడలోని లోక్‌భవన్‌కూ ఎలక్ట్రిక్ లైట్లు అమర్చారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంపు కార్యాలయానికీ ప్రత్యేక విద్యుత్ లైట్లతో అలంకరణ చేశారు.
ప్రకాశం బ్యారేజ్‌నూ విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రఖ్యాత ఉండవల్లి గుహలకూ ఎలక్ట్రిక్ లైట్లను అమర్చారు. చారిత్రక ప్రాముఖ్యత కలిగిన భవనాలు, ప్రముఖ కట్టడాలకూ అలంకరణ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా అమరావతి, విజయవాడ ప్రాంతాలు విద్యుత్ కాంతులతో మరింత శోభను సంతరించుకున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
గుడ్ న్యూస్.. ఆగస్టు చివరి నాటికి ఆ ప్రాజెక్టుల లెఫ్ట్ మెయిన్ కెనాళ్లు ప్రారంభం: మంత్రి నిమ్మల..
ఏపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు బెయిల్