Share News

మీసాలు తిప్పే వారికి బుద్ధి చెప్పక తప్పదు: టీజీ వెంకటేశ్..

ABN , Publish Date - May 16 , 2026 | 07:33 PM

కర్నూలులో మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తన పుట్టిన రోజు సందర్భంగా 60 మంది జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. నూతన వధూవరులను ఆశీర్వదించి నగదు చెక్కులు పంపిణీ చేశారు.

మీసాలు తిప్పే వారికి బుద్ధి చెప్పక తప్పదు: టీజీ వెంకటేశ్..
Ex MP TG Venkatesh

కర్నూలు: మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తన పుట్టిన రోజు సందర్భంగా కర్నూలులో 60 మంది జంటలకు సామూహిక వివాహాలు జరిపించారు. నూతన వధూవరులను ఆశీర్వదించి నగదు చెక్కులు పంపిణీ చేశారు. సామూహిక వివాహ కార్యక్రమం అనంతరం మాజీ ఎంపీ వెంకటేశ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.


రాయలసీమలో మీసాలు తిప్పిన పెద్దపెద్ద వాళ్లు చివరికి వాటిని దించి మా దగ్గరికి వచ్చారు. మీసాలు తిప్పే వారికి బుద్ధి చెప్పక తప్పదు. మీరు 100 మందిని తెస్తే మేము 1000 మంది తెస్తాం. సేవా కార్యక్రమాలకు కోట్లు ఖర్చు చేస్తున్నాం, మా కోసం ఖర్చు పెట్టలేమా?. మీరు రెచ్చిపోతే మా కార్యకర్తలు సరైన రీతిలో బుద్ధి చెబుతారు. మీరు అదుపులో ఉండాలని హెచ్చరిస్తున్నాం. మాకు నీతులు చెప్పే నాయకులు కర్నూలులో ఎన్నో భూములు కబ్జా చేశారు. ఆ భూములను మేము రక్షించాం. కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అలాంటి మాపై బురద చల్లాలని చూస్తే చూస్తూ ఊరుకోం' అని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ కూడా పాల్గొన్నారు.


కాగా, ఇటీవల కర్నూలులో టీడీపీ పోలింగ్ బూత్ ఇన్‌ఛార్జ్ సునీల్‌పై హత్యాయత్నం జరిగింది. ఈ విషయంలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, టీజీ వెంకటేశ్ కుటుంబం మధ్య వివాదం చెలరేగింది. తమ నేతపై హత్యాయత్నం జరగడంపై మంత్రి టీజీ భరత్ ఆగ్రహించారు. ఈ క్రమంలో బాలు అనే వైసీపీ కార్యకర్తను పోలీసులు విచారించారు. దీనిపై స్పందించిన సిద్ధార్థరెడ్డి తమ కార్యకర్తలను ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారని మండిపడ్డారు. అలాగే మంత్రి టీజీ భరత్ కుటుంబంపై పలు అవినీతి ఆరోపణలు చేయడంతో వివాదం మెుదలైంది.


ఈ వార్తలు కూడా చదవండి

ప్రధాని పిలుపుతోనే ఆన్‌లైన్‌లో టీడీపీ మహానాడు: మంత్రి కొల్లురవీంద్ర

వివిధ ప్రాంతాల్లో చోరీలు.. ముగ్గురి అరెస్ట్

Updated Date - May 16 , 2026 | 07:45 PM