రూ.3.5 కోట్లతో కర్నూలు అవుట్‌డోర్ స్టేడియం అభివృద్ధి: మంత్రి టీజీ భరత్
ABN , Publish Date - Oct 29 , 2026 | 09:51 AM
కర్నూలు నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి టీజీ భరత్ అన్నారు. అవుట్‌డోర్ స్టేడియాన్ని రూ.3.5 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
కర్నూలు, అక్టోబర్ 29: నగరంలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూ ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలులోని అవుట్‌డోర్ స్టేడియాన్ని రూ.3.5 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు.
స్టేడియంలో వాకర్స్‌తో మంత్రి మాట్లాడి.. నగరంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. అవుట్‌డోర్ స్టేడియంలో క్రీడాకారులు, వ్యాయామం చేసేవారికి మరింత మెరుగైన వసతులు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా వాలీబాల్, పికిల్‌బాల్ వంటి క్రీడలకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నామని, క్రీడాకారులకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
కర్నూలు నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులు స్పష్టంగా కనిపిస్తున్నాయని.. వాటిపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని మంత్రి టీజీ భరత్ అన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తామని, క్రీడా రంగం అభివృద్ధికి కూడా నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. నగర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
అప్రాధాన్య పోస్టుకు జయేశ్ రంజన్
ఆ జూనియర్ లెక్చరర్లను సర్వీసులోకి తీసుకోండి
Read Latest AP News And Telangana News