Share News

సాయి కృష్ణ కేసులో కృష్ణలంక సీఐ నాగరాజు అరెస్ట్

ABN , Publish Date - Jun 23 , 2026 | 03:08 PM

గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో సంచలన మలుపు చోటుచేసుకుంది. ఈ కేసును.. హత్య కేసుగా మారుస్తూ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

సాయి కృష్ణ కేసులో కృష్ణలంక సీఐ నాగరాజు అరెస్ట్
Sai Krishna Murder Case

అమరావతి, జూన్ 23: గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో సంచలన మలుపు చోటుచేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. దీనిని హత్య కేసుగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకూ హత్యాయత్నం కేసుగా ఉన్న దీనిని, తాజాగా హత్యా నేరంగా పరిగణిస్తూ BNSS లోని 103 (1) సెక్షన్ కింద మార్చారు. వీటితో పాటు నిందితులపై BNSS లోని 127(4), 127(6), 238 సెక్షన్ల కింద కూడా అదనంగా కేసులు నమోదు చేశారు.


ఈ కేసు విచారణలో భాగంగా కృష్ణలంక మాజీ సీఐ నాగరాజును అరెస్ట్ చేశారు. ఆయన్ను అదుపులోకి తీసుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు.. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోని తమ కార్యాలయానికి తరలించి ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో సీఐ నాగరాజు ఇచ్చే వాంగ్మూలం అత్యంత కీలకం కానుండటంతో, ఆయన ఎలాంటి విషయాలు వెల్లడిస్తారనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ కేసు ఎఫ్‌ఐఆర్‌లో మరికొంత మంది ప్రముఖుల పేర్లు కూడా చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. సీఐ నాగరాజు అరెస్ట్‌ను నిరసిస్తూ ఆయన మద్దతుదారులు భారీ సంఖ్యలో కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్దకు చేరుకున్నారు. కార్యాలయం ఎదుట వారంతా బైఠాయించి ఆందోళనకు దిగడంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. ఈ అరెస్ట్‌తో గాదె సాయికృష్ణ అదృశ్యం వెనుక ఉన్న మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.


ఇవీ చదవండి:

కేంద్ర మంత్రి కురియన్ రాజీనామా.. రాష్ట్రపతి ఆమోదం

ఒప్పందం ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: డొనాల్డ్ ట్రంప్

Updated Date - Jun 23 , 2026 | 04:48 PM