Share News

బాధితులకు అండగా ఉంటాం.. పరవాడ ఫార్మాసిటీ ప్రమాదంపై మంత్రి లోకేశ్..

ABN , Publish Date - Jun 23 , 2026 | 12:36 PM

అనకాపల్లి జిల్లాలోని పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతిచెందడం విచారకరమని ఆయన పేర్కొన్నారు.

బాధితులకు అండగా ఉంటాం.. పరవాడ ఫార్మాసిటీ ప్రమాదంపై మంత్రి లోకేశ్..

అనకాపల్లి: పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతిచెందడం విచారకరమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మరోవైపు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. బాధిత కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు.


ఫార్మాసిటీ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కూడా స్పందించారు. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతిచెందడం విషాదకరమని పేర్కొన్నారు. గాయపడిన కార్మికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పారిశ్రామిక ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాల అమలు విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని తేల్చి చెప్పారు.


ఈ ప్రమాదంపై పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు కూడా విచారం వ్యక్తం చేశారు. ఈ అగ్నిప్రమాదం దురదృష్టకరమని, క్షతగాత్రులకు అధికార యంత్రాంగం మెరుగైన వైద్యం అందిస్తోందని పేర్కొన్నారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని.. పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయని అన్నారు. కాగా, ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా పలువురు కూటమి అగ్రనేతలు ఇప్పటికే స్పందించి విచారం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు.. జగన్‌పై మంత్రి నిమ్మల ధ్వజం

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు.. వైసీపీపై ఎంపీ సతీశ్ ఫైర్

Updated Date - Jun 23 , 2026 | 01:52 PM