ప్రతి పాటలో కొత్త భావాన్ని పంచిన మహాగాయకుడు ఎస్పీబీ: జగన్
ABN , Publish Date - Jun 04 , 2026 | 12:12 PM
పద్మవిభూషణ్, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా ఎక్స్‌లో నివాళులు అర్పించారు.
అమరావతి, జూన్ 4: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. సంగీతానికి భాష, ప్రాంతీయ సరిహద్దులు లేవని తన గాత్రంతో ప్రపంచానికి చాటిచెప్పిన గాన గంధర్వుడు, పద్మవిభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని కొనియాడారు. ప్రతి పాటలో కొత్త భావాన్ని పంచిన మహాగాయకుడు ఎస్పీబీ అని జగన్ అన్నారు.
జగన్ ట్వీట్..
‘సంగీతానికి భాష, ప్రాంతీయ సరిహద్దులు లేవని తన అమృత గాత్రంతో ప్రపంచానికి చాటిచెప్పిన గాన గంధర్వుడు, పద్మవిభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. వేలాది పాటలు ఆలపించినా.. ప్రతి పాటలో కొత్త భావాన్ని, కొత్త అనుభూతిని పంచిన మహాగాయకుడు ఆయన. తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా నివాళులు’ అంటూ జగన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి...
రైతుల మధ్య విభేదాలు సృష్టించేందుకు వైసీపీ యత్నం: మంత్రి నారాయణ
ఏపీకి పూర్వవైభవం తీసుకురావడంలో భాగస్వాములవ్వండి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
Read Latest AP News And Telugu News