Share News

యూట్యూబర్ రావణ్‌కు ఏడు రోజుల పోలీస్ కస్టడీ

ABN , Publish Date - Sep 18 , 2026 | 09:05 PM

యూట్యూబర్ రావణ్‌ను గన్నవరం పోలీసులు ఏడు రోజుల కస్టడీకి తీసుకున్నారు. యూట్యూబ్‌ వీడియోలకు సంబంధించి నమోదైన UAPA కేసులో విచారణ కోసం కోర్టు ఈ కస్టడీకి అనుమతించింది.

యూట్యూబర్ రావణ్‌కు ఏడు రోజుల పోలీస్ కస్టడీ
YouTuber Ravan police Custody

కృష్ణా: దేశద్రోహం, ఉపా (UAPA) కేసులో నెల్లూరు జైలులో ఉన్న యూట్యూబర్ రావణ్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో రావణ్‌పై కేసులు నమోదైన సంగతి తెలిసిందే.


ఈ కేసులకు సంబంధించి విచారణ చేపట్టేందుకు రావణ్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు గన్నవరం మెజిస్ట్రేట్‌ను కోరారు. పోలీసుల అభ్యర్థనకు మెజిస్ట్రేట్ నిన్న అనుమతి ఇచ్చారు. దీంతో ఈరోజు నుంచి వారం రోజుల పాటు రావణ్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. విచారణ నిమిత్తం ఆయనను గన్నవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Also Read:

విమానయాన ఖర్చులపై వైసీపీ దుష్ప్రచారం.. ప్రభుత్వ వర్గాల వివరణ

రెవెన్యూ ఉద్యోగుల సమస్యలపై మంత్రి అనగాని హామీ

Updated Date - Sep 18 , 2026 | 09:05 PM