భీముడి పాత్రలో రఘురామకృష్ణరాజు
ABN , Publish Date - Mar 06 , 2026 | 09:29 PM
నియోజకవర్గంలో ప్రజా సమస్యలు, శాసన సభ, శాసన మండలి వేదికగా వాదోపవాదాలు, ప్రజా సమస్యలపై గళమెత్తడం, విమర్శలు, ప్రతి విమర్శలతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల రాజకీయ జీవితాలు సాగిపోతుంటాయి. అయితే..
విజయవాడ, మార్చి 06: నియోజకవర్గంలో ప్రజా సమస్యలు, శాసన సభ, శాసన మండలి వేదికగా వాదోపవాదాలు, ప్రజా సమస్యలపై గళమెత్తడంతోపాటు విమర్శలు, ప్రతి విమర్శలతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల రాజకీయ జీవితాలు సాగిపోతుంటాయి. అలాంటి వారికి శుక్రవారం నాడు ఆటవిడుపు దొరికింది. విజయవాడలో స్థానిక ఆంత్రాలూక్స్ కన్వెన్షన్ వేదికగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్రీడా సాంస్కృతిక ఉత్సవాలు-2026 మెుదలయ్యాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల వేషధారణలు అందరినీ అలరించాయి. భీముడి పాత్రలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అలరించారు.
శ్రీకృష్ణదేవరాయలుగా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ఒదిగిపోయారు. ఎమ్మెల్యేలకు తిప్పలు తెచ్చే కార్యకర్తల మొక్కులు విషయంలో జీవీ ఆంజనేయులు, కామినేని శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, జయమంగళ వెంకటరమణ, సునీల్ తదితరులు అలరించారు. అలాగే వెంకయ్యగా బుచ్చయ్య చౌదరి మెప్పించారు. వీరపాండ్య కట్టబ్రహ్మన పాత్రలో మంత్రి కందుల దుర్గేష్ నటించారు. ఇక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ రుద్రవీణ చిత్రంలో లలిత ప్రియ కమలం విరిసినది.. పాట పాడి ప్రజా ప్రతినిధుల మనస్సును కట్టిపడేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
లిక్కర్ స్కాంలో భారీగా ఆస్తులు అటాచ్
నేపాల్ ఎన్నికల కౌంటింగ్.. విజయం దిశగా నూతన పార్టీ