నేపాల్ ఎన్నికల కౌంటింగ్.. విజయం దిశగా నూతన పార్టీ
ABN , Publish Date - Mar 06 , 2026 | 09:19 PM
ఇటీవల నేపాల్ పార్లమెంటు ప్రతినిధుల సభకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. నేడు ప్రారంభమైన కౌంటింగ్‌లో నూతన పార్టీ ఆర్ఎస్‌పీ ప్రస్తుతం ముందంజలో ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: జెన్-జీ నిరసనల తరువాత గురువారం (మార్చ్ 5) తొలిసారిగా నేపాల్ ప్రతినిధుల సభకు ఎన్నికలు జరిగాయి. నేడు జరుగుతున్న ఓట్ల కౌంటింగ్‌లో నూతన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీకి (ఆర్‌ఎస్‌పీ) విజయం దాదాపుగా ఖరారైనట్టు అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మాజీ సింగర్ బాలేంద్ర షా నేతృత్వంలోని ఆర్‌ఎస్‌పీ 165 స్థానాలకు గాను 94 సీట్లల్లో ముందు వరుసలో ఉంది. ఇక నేపాలీ కాంగ్రెస్ ఒక సీటులో విజయం సాధించగా పది స్థానాల్లో లీడ్‌లో ఉంది. సీపీఎన్-యూఎమ్ఎల్ పార్టీ మరో ఏడు స్థానాల్లో ముందంజలో ఉంది. నేపాలీ కమ్యునిస్టు పార్టీ నాయకులు తొమ్మిది స్థానాల్లో లీడ్‌లో ఉన్నట్టు అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇక మార్చి 9 కల్లా కౌంటింగ్ పూర్తి అవుతుందని నేపాల్ ప్రధాన ఎన్నికల కమిషనర్ రామ్ ప్రసాద్ భండారీ తెలిపారు. 2022 నాటి ఎన్నికలు జరిగిన దాదాపు రెండు వారాలకు ఫలితాలు విడుదలయ్యారు. నేపాల్ ప్రతినిధుల సభలోని మొత్తం 275 స్థానాలకు ఎన్నికలను నిర్వహించారు. వీటిలో 165 స్థానాలకు ఫస్ట్ పాస్ట్ ది పోస్టు పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. ఈ స్థానాల్లో అత్యధిక ఓట్లు గెలుపొందిన వ్యక్తిని విజేతగా ఖరారు చేస్తారు. మిగిలిన 110 స్థానాల్లో దామాషా పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. వీటి ఫలితాలు వెలువడేందుకు కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉందని అక్కడి మీడియా చెబుతోంది.
ఇక పార్లమెంటు దిగువ సభకు ఎన్నికలు నిర్వహించినందుకు నేపాల్‌ను తాజాగా చైనా అభినందించింది. రాజకీయంగా నేపాల్ ఎలాంటి అవాంతరాలు లేకుండా ముందడుగు వేస్తున్న వైనం తమకు సంతృప్తిని ఇచ్చిందని నేపాల్ విదేశాంగ శాఖ ప్రతినిధి పేర్కొన్నారు. స్వాతంత్ర్యం, సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు నేపాల్, చైనాలు పరస్పరం సహకరించుకుంటాయని అన్నారు.
ఇరాన్ బేషరతుగా లొంగిపోవాల్సిందే.. ట్రంప్ స్పష్టీకరణ
ఖతర్ మంత్రి హెచ్చరిక! యుద్ధం మరో రెండు వారాల పాటు కొనసాగితే..