వివాహితకు మాజీ ప్రియుడి వేధింపులు.. సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటపెట్టి..
ABN , Publish Date - Oct 04 , 2026 | 10:05 PM
తనను కలవాలని లేకుంటే గతంలో సన్నిహితంగా ఉన్న వీడియోలను బయటపెడతానని ఓ మహిళను మాజీ ప్రియుడు బెదిరించాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఓ వివాహితను వ్యక్తిగత ఫొటోలు, వీడియోలతో మాజీ ప్రియుడు వేధించాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు అతడిపై దాడి చేశారు. విజయవాడలో ఈరోజు (ఆదివారం) జరిగిందీ ఘటన. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తనను కలవాలని లేకుంటే గతంలో సన్నిహితంగా ఉన్న వీడియోలను బయటపెడతానని ఓ మహిళను మాజీ ప్రియుడు బెదిరించాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అలాగే ఆ మహిళ భర్తకు కూడా పంపించాడు. దీంతో ఆమెను తన భర్త వదిలేశాడు.
ఈ విషయాన్ని ఆ మహిళ తన కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు పథకం ప్రకారం మాజీ ప్రియుడిని విజయవాడకు రప్పించి దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్నారు.
ఈ వార్తలూ చదవండి
ఏపీలో బీపీసీఎల్ భారీ ప్రాజెక్ట్‌కు కేంద్ర పర్యావరణ గ్రీన్‌సిగ్నల్!
ఏపీలో గృహ నిర్మాణ రంగంలో నూతన శకం ప్రారంభం: పవన్ కల్యాణ్