Share News

‘వీబీ జీ రామ్ జీ’ పథకం కింద ఏపీకి భారీ నిధులు.. పవన్ హర్షం

ABN , Publish Date - Jun 10 , 2026 | 02:48 PM

వీబీ జీ రామ్ జీ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,707.21 కోట్ల తాత్కాలిక కేటాయింపుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్స్‌ వేదికగా స్పందించారు. దేశంలోనే మూడవ అత్యధిక నిధులను ఏపీ పొందిందని తెలిపారు.

‘వీబీ జీ రామ్ జీ’ పథకం కింద ఏపీకి భారీ నిధులు.. పవన్ హర్షం
Deputy CM Pawan Kalyan

అమరావతి, జూన్ 10: ‘వీబీ జీ రామ్ జీ’ (VB G RAM G) పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,707.21 కోట్ల తాత్కాలిక కేటాయింపుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్స్‌ వేదికగా స్పందించారు. దేశంలోనే మూడో అత్యధిక నిధులను ఏపీ పొందిందని తెలిపారు. ఇది పారదర్శక పాలన, సమర్థవంతమైన అమలు పట్ల తమ నిబద్ధతకు ఓ బలమైన నిదర్శనమని చెప్పుకొచ్చారు. ఈ మద్దతు గ్రామీణ పరివర్తనను వేగవంతం చేస్తుందన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని, జీవనోపాధిని మెరుగుపరుస్తుందని చెప్పారు.


ఏపీ, దేశాభివృద్ధి కోసం కఠోర శ్రమతో ఊపిరి పోస్తున్న రైతులు, మహిళలు, యువత, శ్రామికులకు ఇది మరింత మెరుగైన అవకాశాలను కల్పిస్తుందని పవన్ అన్నారు. దూరదృష్టితో కూడిన నాయకత్వం, గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్న ప్రధాన మంత్రికి పవన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌పై నిరంతర మద్దతు, నమ్మకాన్ని ఉంచినందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు, వర్గాలకు అభివృద్ధి వనరులు చేరేలా చూడటంలో పారదర్శకమైన, నిష్పాక్షికమైన విధానాన్ని అనుసరిస్తున్న భారత ప్రభుత్వానికి మరోసారి ధన్యవాదాలు అంటూ పవన్ కల్యాణ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి...

భారతీరాజా మృతికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతాపం

మాతృభూమిపై గౌరవం.. దేశానికే జీవితం అంకితం.. మోదీపై పవన్ ప్రశంసలు

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 10 , 2026 | 03:43 PM