ప్రముఖ దర్శకుడు భాగ్యరాజ్ మృతిపై పవన్ కల్యాణ్ సంతాపం
ABN , Publish Date - Jun 27 , 2026 | 04:40 PM
ప్రముఖ దర్శకుడు, నటుడు, రచయిత కె. భాగ్యరాజ్ మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు. రచయితగా, సహాయ నటుడిగా భాగ్యరాజ్ సినీ జీవితాన్ని ప్రారంభించారన్నారు.
అమరావతి, జూన్ 27: ప్రముఖ దర్శకుడు, నటుడు, రచయిత కె. భాగ్యరాజ్ మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు. భాగ్యరాజ్ కన్నుమూశారని తెలిసి చింతించానని చెబుతూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. రచయితగా, సహాయ నటుడిగా భాగ్యరాజ్ సినీ జీవితాన్ని ప్రారంభించారన్నారు. అనంతరం తమిళ చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా, హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారని కొనియాడారు. ఆయన దర్శకత్వం వహించిన, కథ-స్క్రీన్‌ప్లే అందించిన అనేక చిత్రాలు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రీమేక్ అయి ఘనవిజయం సాధించాయని గుర్తు చేశారు.
ప్రేమ, కుటుంబ కథలను ఆయన మలిచిన తీరు ఒక తరం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుందని పవన్ తెలిపారు. తన సినిమాల ద్వారా భారతీయ సినీ రంగంలో చెరగని ముద్ర వేశారని అన్నారు. ఈ సందర్భంగా కె. భాగ్యరాజ్ కుటుంబ సభ్యులకు పవన్ కల్యాణ్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఇవి కూడా చదవండి...
ఇది ముమ్మాటికీ అమరావతి రైతులపై రౌడీ మూకల దాడే: హోం మంత్రి అనిత
అందరికీ సంపూర్ణ ఆరోగ్యం కోసమే సంజీవని పథకం: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News