Share News

చంద్రబాబు, లోకేశ్, పవన్ పేర్లపై రాజశ్యామల యాగం చేసిన మంత్రి పార్థసారథి..

ABN , Publish Date - Apr 30 , 2026 | 02:55 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని మంత్రి కొలుసు పార్థసారథి రాజశ్యామల యాగం నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ పేర్లపై ప్రత్యేకంగా ఈ యాగం చేశారు.

చంద్రబాబు, లోకేశ్, పవన్ పేర్లపై రాజశ్యామల యాగం చేసిన మంత్రి పార్థసారథి..
Minister Kolusu Partha Sarathy

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని మంత్రి కొలుసు పార్థసారథి రాజశ్యామల యాగం నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ పేర్లపై ప్రత్యేకంగా ఈ యాగాన్ని చేశారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని తన సొంత గ్రామమైన కారకంపాడులో రాజశ్యామల యాగాన్ని మంత్రి పార్థసారథి నిర్వహించారు.


పెద్దఎత్తున హోమ గుండాన్ని నిర్మించి, పండితులతో యాగం జరిపించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మంత్రి కోరుకున్నారు. ఈ యాగంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. మరోవైపు కూటమి శ్రేణులూ పెద్దఎత్తున తరలివచ్చారు. రాజశ్యామల యాగంతో మంత్రి పార్థసారథి స్వగ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.


హిందూ సంప్రదాయాల ప్రకారం రాజకీయ విజయం, శత్రువులపై పైచేయి, అపారమైన జ్ఞానం, కీర్తి ప్రతిష్ఠల కోసం రాజశ్యామల యాగాన్ని చేస్తుంటారు. జ్ఞాన సరస్వతి రూపమైన రాజశ్యామల దేవిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు ఈ యాగాన్ని చేస్తారు. పూర్వ కాలంలో చేసే రాజసూయ యాగంతో సమానమైన ఫలితాలను రాజశ్యామల యాగం ఇస్తుందని పండితులు చెబుతుంటారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలకు ఆమోదముద్ర

సీఎం చంద్రబాబు పమిడిముక్కల పర్యటనను దిగ్విజయం చేయండి: పార్థసారథి

Updated Date - Apr 30 , 2026 | 02:57 PM