Share News

మెగా డీఎస్సీపై వైఎస్ జగన్, వైసీపీది దిగజారుడు రాజకీయం: బొండా ఉమామహేశ్వరరావు..

ABN , Publish Date - Sep 08 , 2026 | 03:12 PM

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా డీఎస్సీపై వైసీపీ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. మెగా డీఎస్సీ ద్వారా సీఎం చంద్రబాబు ప్రభుత్వానికి వచ్చిన పేరు, ప్రతిష్ఠలను తట్టుకోలేక వైసీపీ స్వార్థ రాజకీయాలకు తెరతీసిందని ధ్వజమెత్తారు.

మెగా డీఎస్సీపై వైఎస్ జగన్, వైసీపీది దిగజారుడు రాజకీయం: బొండా ఉమామహేశ్వరరావు..
MLA Bonda Uma

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా డీఎస్సీపై వైసీపీ, వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. మెగా డీఎస్సీ ద్వారా సీఎం చంద్రబాబు ప్రభుత్వానికి వచ్చిన పేరు, ప్రతిష్ఠలను తట్టుకోలేక వైసీపీ స్వార్థ రాజకీయాలకు తెరతీసిందని ధ్వజమెత్తారు. డీఎస్సీ అంశాన్ని వైసీపీ నేతలు రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. 16,400 మంది డీఎస్సీ యువత భవిష్యత్తుతో వైసీపీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారని బొండా ఉమా ఆరోపించారు.


పచ్చ కామెర్లు ఉన్న వారికి ఊరంతా పచ్చగా కనిపించినట్లు జగన్‌ వైఖరి ఉందంటూ ఎమ్మెల్యే బొండా ఉమా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీలో అవకతవకలు జరిగాయని ఏపీ హైకోర్టు సైతం వ్యాఖ్యానించిందని చెప్పుకొచ్చారు. నిరుద్యోగులకు దక్కాల్సిన ఉద్యోగాలను అవినీతికి తెరలేపుతూ ఇష్టారీతిన అమ్ముకున్నారని గత ప్రభుత్వంపై ఆయన ఆరోపణలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజే ముఖ్యమంత్రి చంద్రబాబు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారని గుర్తు చేశారు. నిరుద్యోగ యువతకు ప్రతి సంవత్సరం జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని గతంలో హామీ ఇచ్చిన జగన్‌.. ఐదేళ్ల పాలనలో కనీసం ఒక్కసారైనా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేశారా? అని సూటిగా ప్రశ్నించారు. అలాగే, గత ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ అయినా నిర్వహించారా? అని నిలదీశారు.


చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులను మద్యం దుకాణాల ముందు కాపలాగా పెట్టిన ఘనత జగన్‌ ప్రభుత్వానిదేనని బొండా ఉమా విమర్శించారు. ఇప్పుడు నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ముందుకెళ్తుంటే.. వైసీపీ మాత్రం రాజకీయ లబ్ధి కోసం మెగా డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తోందని నిప్పులు చెరిగారు. ఏపీ ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి వారు తగిన బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే ఉమా హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఫేక్ ప్రచారంతో చేస్తున్న కుట్రలను సమర్థంగా ఫ్యాక్ట్‌తో తిప్పికొట్టండి: సీఎం చంద్రబాబు

తాతా మధుపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే ఆలోచ మాకు లేదు: స్పీకర్ గడ్డం ప్రసాద్

Updated Date - Sep 08 , 2026 | 03:18 PM