Share News

కార్గిల్ విజయ్ దివస్.. అమరవీరులకు చంద్రబాబు, పవన్ నివాళి..

ABN , Publish Date - Jul 26 , 2026 | 09:13 AM

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు. కార్గిల్ యుద్ధంలో వారు చూపిన ధైర్యసాహసాలు, పోరాడిన తీరును ప్రశంసించారు.

కార్గిల్ విజయ్ దివస్.. అమరవీరులకు చంద్రబాబు, పవన్ నివాళి..
Kargil Vijay Diwas 2026

అమరావతి: కార్గిల్ విజయ్ దివస్-2026 సందర్భంగా అమరవీరులకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు. కార్గిల్ యుద్ధంలో వారు చూపిన ధైర్యసాహసాలు, పోరాడిన తీరును ప్రశంసించారు. ఈ సందర్భంగా దేశం కోసం అమరవీరులు చేసిన పోరాటం, త్యాగాలను స్మరించుకున్నారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు వారు చేసిన కృషిని కొనియాడారు. ఈ మేరకు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఎక్స్ వేదికగా నివాళులు అర్పిస్తూ పోస్టులు పెట్టారు.


చంద్రబాబు ఎక్స్ పోస్టు..

‘తమ అసాధారణ ధైర్యసాహసాలతో భారతదేశానికి విజయాన్ని సాధించిన వీర సైనికులకు మనం ఘనంగా నివాళులర్పిస్తున్నాము. దుర్భేద్యమైన భూభాగం, అంతులేని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని, వారు దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి దృఢంగా నిలబడ్డారు. వారి మహోన్నత త్యాగం, సాటిలేని వీరత్వం తరతరాలకు స్ఫూర్తినిస్తూ దేశభక్తికి, జాతీయ గర్వానికి శాశ్వత చిహ్నంగా నిలుస్తున్నాయి’ అంటూ చంద్రబాబు పోస్టు చేశారు.


పవన్ కల్యాణ్ ఎక్స్ పోస్టు..

‘కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అసాధారణ శౌర్యం, అత్యున్నత త్యాగంతో దేశ సార్వభౌమత్వాన్ని కాపాడి, త్రివర్ణ పతాక గౌరవాన్ని నిలబెట్టిన అమరవీరులకు నివాళులర్పిస్తున్నా. కార్గిల్ కేవలం యుద్ధ విజయం మాత్రమే కాదు.. అది ధైర్యం, త్యాగం, భారతదేశ అఖండ స్ఫూర్తికి ప్రతీక. కార్గిల్ మంచు శిఖరాలపై ధైర్యవంతులైన సైనికులు అసాధ్యమైన సవాళ్లను ఎదుర్కొని, మన పవిత్ర మాతృభూమిలోని ప్రతి అంగుళాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఓ భారతీయ సైనికుడి ధైర్యం కంటే గొప్పది ఏదీ లేదని ప్రపంచానికి చాటి చెప్పారు. మనం జీవించే ప్రతి ప్రశాంతమైన రోజు, వెంబడించే ప్రతి కల, ఆస్వాదించే ప్రతి అవకాశం వారి త్యాగం అనే పునాదిపైనే నిలబడి ఉన్నాయి. కార్గిల్ కేవలం చరిత్రలోని ఒక అధ్యాయం మాత్రమే కాదు.. అది దేశభక్తి, కర్తవ్యం, దృఢ సంకల్పం, నిస్వార్థ సేవకు నిదర్శనం. విజయాన్ని సాధ్యం చేసిన సైనికులందరినీ భారత్ స్మరించుకుంటుంది. జై హింద్’ అంటూ పవన్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఇంజనీరింగ్‌ కనీస ఫీజు 47వేలు

ముద్రగడ ఉద్యమంతోనే టీడీపీ అధికారాన్ని కోల్పోయింది

Updated Date - Jul 26 , 2026 | 09:27 AM