BV Raghavulu on Jagan: 'ఇదేం తీరు ?'.. వైఎస్ జగన్‌కు బీవీ రాఘవులు హితవు..
ABN , Publish Date - Jan 11 , 2026 | 04:56 PM
అమరావతిని రాజధానిగా అందరూ అంగీకరించారు. ఇప్పుడు మళ్లీ వివాదం చేయడం సరికాదని సీపీఎం నేత బీవీ రాఘవులు అన్నారు. జగన్ మొదట్లో అమరావతిని రాజధానిగా అంగీకరించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. జగన్ ఇకనైనా తన తీరు మార్చుకోవాలని రాఘవులు సూచించారు.
విజయవాడ, జనవరి 11: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంపై వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు, వివాదాలు అనవసరమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు, సీనియర్ నేత బి.వి.రాఘవులు హితవుపలికారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 15 ఏళ్లు అవుతున్నా ఇంకా రాజధాని అంశంపై వివాదాలు లేవనెత్తడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. దీనికి సంబంధించి రాఘవులు కీలక వ్యాఖ్యలు చేశారు.
అమరావతిని రాజధానిగా అందరూ(పార్టీలు, ప్రజలు) అంగీకరించారని.. ఇప్పుడు మళ్లీ వివాదం చేయడం అనవసరమని రాఘవులు అన్నారు. జగన్ మొదట్లో అమరావతిని రాజధానిగా అంగీకరించిన విషయాన్ని ఈయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. జగన్ ఇకనైనా తన తీరు మార్చుకోవాలని రాఘవులు సూచించారు. కృష్ణానది తీర ప్రాంతంలో అమరావతి ఉందా, లేదా? అనే చర్చకు ఇప్పుడు అర్థం లేదని.. రాజధాని నిర్మాణ పనుల్లో లోపాలు, అవినీతి ఉంటే వాటిని ప్రశ్నించాలని హితవుపలికారు. రాజధానిని అంగీకరించి, త్వరగా అభివృద్ధి చేసేలా కూటమి ప్రభుత్వం, కేంద్రంపైనా ఒత్తిడి తెచ్చేలా సహకరించాలని రాఘవులు సూచించారు.
అటు, రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోలవరం వంటి అంశాల గురించి చంద్రబాబుపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలను కూడా రాఘవులు విమర్శించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పిన వెలిగొండ, హంద్రీ నీవా, గాలేరు ప్రాజెక్టులు ఇంకా పూర్తికాలేదని, ఇలాంటి సమయంలో లేని ప్రాజెక్టుల గురించి అనవసర రాద్దాంతం చేసి ప్రజలకు అన్యాయం చేయవద్దని ఆయన అన్నారు. పోలవరం పేరుతో వైఫల్యాలు ఎత్తిచూపడం సరికాదని జగన్ కు బి.వి.రాఘవులు సూచించారు.
ఇవీ చదవండి:
ముసుగు ధరించి వస్తే గోల్డ్ విక్రయించం.. వర్తకుల కీలక నిర్ణయం..
ఇతడు మామూలోడు కాదు.. డబ్బు కోసం కట్టుకున్న భార్యను..