Share News

అభివృద్ధిని చూసి జగన్ ఓర్చుకోలేకపోతున్నారు: పల్లా శ్రీనివాసరావు

ABN , Publish Date - Jul 31 , 2026 | 03:35 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మరోసారి విరుచుకుపడ్డారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రాకు మణిహారమని గుర్తు పెట్టుకో జగన్ అని అన్నారు.

అభివృద్ధిని చూసి జగన్ ఓర్చుకోలేకపోతున్నారు: పల్లా శ్రీనివాసరావు
Palla Srinivasa Rao

విశాఖపట్నం, జులై 31: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మరోసారి విరుచుకుపడ్డారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రాకు మణిహారమని గుర్తు పెట్టుకో జగన్ అని అన్నారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు తెలిపారు. అభివృద్ధిని చూసి జగన్ ఓర్చుకోలేకపోతున్నారని విమర్శించారు. కేవలం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి ఆటంకం కలిగించేందుకే విశాఖకు జగన్ వచ్చారని ఆరోపించారు.


కుతంత్రాలతో అభివృద్ధిని ఆపలేరని పల్లా అన్నారు. రానున్న కాలంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనుందని వెల్లడించారు. గాజువాక నుంచి125, జిల్లా మొత్తం 5000 వేల బస్సుల్లో 5 లక్షల మంది ప్రజలు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రత్యేకంగా దర్శించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టును నిర్మించడం వల్ల అంతర్జాతీయంగా వ్యాపారస్థులు ఉత్తరాంధ్రకు రావడం అలాగే పరిశ్రమలు స్థాపించడానికి అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు.


బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ రావడం వల్ల ఎన్నో పరిశ్రమలు వచ్చాయని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. రానున్న కాలంలో ఉత్తరాంధ్ర.. స్వర్ణాంధ్ర బాటలో వెళ్లి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉందన్నారు. ఇకపై ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆగుతాయని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

19 విశ్వవిద్యాలయాల పాలక మండళ్ల రద్దు.. నామినేటెడ్ సభ్యుల తొలగింపు

గోదావరి వరద ఉధృతి.. అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ హెచ్చరిక

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 31 , 2026 | 04:27 PM