కన్న తల్లి, సొంత చెల్లి నుంచే జగన్ వెన్నుపోటు మొదలు: వాసంశెట్టి సుభాశ్
ABN , Publish Date - Jun 06 , 2026 | 04:35 PM
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి వాసంశెట్టి సుభాశ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సొంత ఇంటి నుంచే వెన్నుపోటును ప్రారంభించిన జగన్.. వెన్నుపోటు దినానికి కేరాఫ్ అడ్రస్‌గా మారారంటూ వ్యాఖ్యానించారు.
అమరావతి, జూన్ 6: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి వాసంశెట్టి సుభాశ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సొంత ఇంటి నుంచే వెన్నుపోటును ప్రారంభించిన జగన్.. వెన్నుపోటు దినానికి కేరాఫ్ అడ్రస్‌గా మారారంటూ వ్యాఖ్యానించారు. కన్న తల్లి, సొంత చెల్లి నుంచే జగన్ వెన్నుపోటు మొదలైందని అన్నారు. బాబాయ్‌కి వెన్నుపోటుతో పాటు గొడ్డలి పోటు వేయించి గండ్ర గొడ్డలి పార్టీగా పేరు తెచ్చారంటూ విమర్శించారు. పేర్ని నాని, కొడాలి నానిల పిచ్చి పిచ్చి ప్రెస్‌మీట్‌లు.. మరో పిచ్చోడైన జగన్‌కు మాత్రమే నచ్చుతాయన్నారు.
జగన్ మానసిక స్థితికి మందుల డోస్ పెంచితే ఏం ప్రమాదం ఉంటుందో అనే భయం వైద్యుల్లో ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. జగన్‌కు అప్పుడప్పుడు కరెంట్ షాక్ లాంటి చికిత్స అవసరమన్నారు. జగన్ ప్రెస్‌మీట్ అంటే కాసేపు నవ్వుకోవడానికి స్ట్రెస్ రిలీఫ్‌గా ఫీలవుతున్నామని అన్నారు. పేకాట క్లబ్‌లు, క్యాసినోలు ఆడించే బ్యాచ్‌కు బ్రిడ్జ్ కోర్సు గురించి ఎలా తెలుస్తుందన్నారు. అపహాస్యం పాలయ్యే వింత కార్యక్రమాలు వైసీపీ చేపడుతోందని దుయ్యబట్టారు. కోటి సంతకాలు అన్న వాళ్లకి ప్రజా మద్దతు లేకపోవటంతో పెట్టిన సంతకాలే మళ్లీ మళ్లీ పెట్టేందుకు వైసీపీ నేతలు ఇబ్బంది పడ్డారంటూ మంత్రి వాసంశెట్టి సుభాశ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
2047కి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి: కేంద్ర మంత్రి పెమ్మసాని
దేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక గుర్తింపు: కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్
Read Latest AP News And Telugu News