ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
ABN , Publish Date - Mar 10 , 2026 | 03:10 PM
ఏపీలో 11 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నగరపాలక సంస్థలకు ఆయా జిల్లాల కలెక్టర్లు స్పెషల్ ఆఫీసర్లుగా నియమించింది సర్కార్.
అమరావతి, మార్చి 10: రాష్ట్రంలో11 నగర పాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం(AP Government) నియామక ఉత్తర్వులను జారీ చేసింది. నగరపాలక సంస్థలకు ఆయా జిల్లాల కలెక్టర్లను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించింది సర్కార్. ఈ మేరకు ఈరోజు(మంగళవారం) ప్రభుత్వం జీవోను జారీ చేసింది. ఆరు నెలల పాటు కలెక్టర్లు స్పెషల్ ఆఫీసర్లుగా కొనసాగుతారని జీవోలో స్పష్టంగా పేర్కొంది.
విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, మచిలీపట్టణం, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు నగరపాలక సంస్థలకు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. ఇవికాకుండా 75 పురపాలక సంఘాలకు కూడా ప్రత్యేక అధికారులను నియమిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి..
ఏపీలో ఎండ తీవ్రతపై హోం మంత్రి అనిత సమీక్ష.. కీలక ఆదేశాలు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన 59వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం
Read Latest AP News And Telugu News