ఏపీలో డేటా సెంటర్ల ఏర్పాటుకు కీలక నిర్ణయం.. అదానీ ఇన్ఫ్రా ప్రతిపాదనలకు SIPB ఆమోదం
ABN , Publish Date - Aug 20 , 2026 | 12:17 PM
ఏపీలో డేటా సెంటర్ల ఏర్పాటుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అదానీ ఇన్ఫ్రా ప్రతిపాదనలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపింది.
అమరావతి, ఆగస్టు 20: ఏపీలో డేటా సెంటర్ల ఏర్పాటుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అదానీ ఇన్ఫ్రా ప్రతిపాదనలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(SIPB) ఆమోదం తెలిపింది. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి సంబంధించిన విక్రయ ఒప్పందాల్లో మార్పులకు కూడా SIPB గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదానీ ఇన్ఫ్రా అనుబంధ సంస్థలైన విశాఖ హైపర్‌స్కేల్, మెగా, రాంబిల్లి డేటా సెంటర్ పార్కులకు సవరించిన నిబంధనలు వర్తించనున్నాయి. రాష్ట్రంలో డేటా సెంటర్ల ద్వారా భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో విదేశీ వాణిజ్య రుణాలు (ECBs) పొందేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
భూ కేటాయింపు రద్దు నోటీసులు జారీ చేయడానికి ముందు సంస్థలకు 30 రోజుల సమయం(క్యూర్ పీరియడ్) ఇచ్చేలా ఒప్పందంలో సవరించింది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్(GVMC) పరిధిలోని 5.84 ఎకరాల భూమిని అదానీ సంస్థకు లీజుకు కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. దేవాదాయ శాఖ భూములకు వర్తించే లీజు రేట్ల ప్రకారం, ఎస్‌ఆర్‌ఓ విలువలో 3 శాతం చొప్పున లీజు రేటును నిర్ణయించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. జీఎస్టీ ఆదాయం రాష్ట్రానికే వచ్చేలా డేటా సెంటర్ నిర్మాణాలు, సరఫరాదారులు ఏపీలోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి...
క్రమశిక్షణ కమిటీకి లేఖ రాయనున్న కొండా సురేఖ.. కూతురిని సమర్ధిస్తారా?
తీర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలపై ఎమ్మెల్యే ప్రశ్న.. మంత్రి నాదెండ్ల సమాధానం
Read Latest AP NEws And Telugu News