Share News

టౌన్ ప్లానింగ్ విభాగాల్లో అక్రమాలు... కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

ABN , Publish Date - Mar 11 , 2026 | 10:42 AM

రాష్ట్రంలోని టౌన్ ప్లానింగ్ విభాగాల్లో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. బిల్డింగ్ ప్లాన్ ఆమోదాల్లో అక్రమాలు, లంచాల ఆరోపణలపై సోదాలు జరుగుతున్నాయి.

టౌన్ ప్లానింగ్ విభాగాల్లో అక్రమాలు... కొనసాగుతున్న ఏసీబీ సోదాలు
ACB Raids

అమరావతి, మార్చి 11: ఆంధ్రప్రదేశ్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగాల్లో రెండో రోజు ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. నిన్న(మార్చి 10న) మొత్తం 13 జిల్లాల్లోని మున్సిపల్ కార్పొరేషన్ల టౌన్ ప్లానింగ్ విభాగాల్లో ఏసీబీ అధికారులు చేపట్టిన సోదాలు ఈరోజు కూడా కొనసాగుతున్నాయి. లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS), బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (BPS), వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ (VLT) రిజిస్టర్లు సరిగ్గా మెయింటైన్ చేయడం లేదని అధికారులు గుర్తించారు.


కొన్ని ప్రాంతాల్లో బిల్డింగ్ ప్లాన్లను ఎలాంటి కారణాలు చూపకుండా హోల్డ్ చేశారని, మరికొన్ని చోట్ల ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మాణాలు జరిగినట్లు ఏసీబీ అధికారుల సోదాల్లో బయటపడింది. బిల్డింగ్ ప్లాన్ ఆమోదాల్లో అక్రమాలు, లంచాల ఆరోపణలపై ఈ సోదాలు జరుగుతున్నాయి. నేడు(బుధవారం) నిర్మాణాలు జరుగుతున్న, జరిగిన ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు.


రాష్ట్ర వ్యాప్తంగా టౌన్ ప్లానింగ్ అధికారులు నిబంధనల ప్రకారం అనుమతులు ఇచ్చారా? నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఏమైనా చర్యలు తీసుకున్నారా? అనేది ఆధారాలతో పరిశీలించనున్నారు ఏసీబీ అధికారులు. నిన్న గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, అనంతపురం తదితర జిల్లాల్లో సోదాలు జరిపిన ఏసీబీ బృందాలు.. ఫైల్స్, హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి...

రూ.25 లక్షలు తీసుకుని మోసం.. మాజీ ఎంపీపై చీటింగ్ కేసు

పానిక్ హార్వెస్టింగ్ చేయొద్దు.. రొయ్యల రైతులకు మంత్రి సూచన

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 11 , 2026 | 10:55 AM