భూ వివాదం.. కృష్ణాజిల్లాలో మామను చంపిన అల్లుడు
ABN , Publish Date - Jun 18 , 2026 | 11:34 AM
కృష్ణా జిల్లాలోని కంకిపాడు మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భూ వివాదంలో మామను.. అల్లుడు అతి దారుణంగా హత్య చేశాడు.
కృష్ణా, జూన్ 18: జిల్లాలోని కంకిపాడు మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మండల పరిధిలోని గోశాల గ్రామంలో కేవలం ఒక స్థలం వివాదానికి సంబంధించిన గొడవ చివరకు ఒకరి ప్రాణం తీసే వరకూ వెళ్లింది. ఆస్తి తగాదాల నేపథ్యంలో స్వయానా అల్లుడే.. మామపై దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోశాల గ్రామానికి చెందిన ఉప్పల సాంబశివరావు (65) అనే వృద్ధుడికి, అతని అల్లుడికి మధ్య కొంతకాలంగా ఒక స్థలానికి సంబంధించిన వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం ఇరుపక్షాల మధ్య మరోసారి తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ గొడవ కాస్తా ముదరడంతో ఆగ్రహంతో ఊగిపోయిన అల్లుడు.. మామ అని కూడా చూడకుండా సాంబశివరావుపై ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు. సాంబశివరావు ఛాతిపై అల్లుడు బలంగా కొట్టడంతో ఘటనా స్థలంలోనే కుప్పకూలి కన్నుమూశారు. సమాచారం అందుకున్న కంకిపాడు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
స్వదేశీ కామికాజ్ డ్రోన్ల తయారీకి టెండర్లు
బాస్ పేరిట వాట్సాప్ మెసేజ్..