నా మౌనాన్ని బలహీనతగా భావించకండి
ABN , Publish Date - Nov 19 , 2026 | 06:03 AM
నకిలీ ఉద్యోగ నియామకాల స్కాంలో అసలు నిందితులను వదిలిపెట్టి కావాలనే తనను టార్గెట్ చేస్తున్నారని జనసేన నాయకురాలు, కైరెన్ కన్సల్టెన్సీ సీఈవో కోటా రుక్మిణి ఆవేదన వ్యక్తం చేశారు
అసలు నిందితులను వదిలేసి నన్ను టార్గెట్ చేస్తున్నారు
పవన్ కల్యాణ్ పేరును లాగకండి: కోటా రుక్మిణి
మంగళగిరి, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): నకిలీ ఉద్యోగ నియామకాల స్కాంలో అసలు నిందితులను వదిలిపెట్టి కావాలనే తనను టార్గెట్ చేస్తున్నారని జనసేన నాయకురాలు, కైరెన్ కన్సల్టెన్సీ సీఈవో కోటా రుక్మిణి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ఈ స్కాం విషయం నా దృష్టికి వచ్చిన వెంటనే బోడపాటి ధరణీకృష్ణను ఉద్యోగం నుంచి తొలగించా. విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని నేనే స్వయంగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాను. నా ఫిర్యాదును పురస్కరించుకుని మంగళగిరి రూరల్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇది నా సంస్థలో పనిచేసిన ఓ ఉద్యోగిని చేసిన వ్యక్తిగత మోసం. ఈ వివాదంలోకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేరును అనవసరంగా లాగొద్దు. నా మౌనాన్ని బలహీనతగా, సహనాన్ని భయంగా భావించవద్దు. నాపై అసత్య ఆరోపణలు చేస్తే చట్టపరంగా పోరాడతా. నేను అంకితభావం కలిగిన జనసైనికురాలిని. పార్టీకి, నాయకత్వానికి చెడ్డపేరు తేవాలని చూసే వారి కుట్రలను తిప్పికొడతా’ అని రుక్మిణి స్పష్టం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్‌కు లోకేశ్ కౌంటర్
పంజాబ్‌లో లారీ డ్రైవర్‌కు రూ.12 కోట్ల జాక్‌పాట్