Share News

శ్రీ చైతన్య ఇంటర్‌ విద్యార్థి బలవన్మరణం

ABN , Publish Date - Aug 08 , 2026 | 12:04 PM

కాకినాడ శ్రీ చైతన్య కళాశాల సిబ్బంది వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ ఇంటర్‌ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే..

శ్రీ చైతన్య ఇంటర్‌ విద్యార్థి  బలవన్మరణం
kakinada sri chaitanya collage student

కాకినాడ క్రైం, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): స్థానిక శ్రీచైతన్య జూనియర్ కళాశాల సిబ్బంది వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ ఇంటర్‌ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాకినాడ జగన్నాథపురంలోని జె.రామారావుపేట సమ్మెటవారి వీధికి చెందిన పైలా రాంబాబు, జ్యోతి దంపతుల రెండో కుమారుడు పైలా అరవింద్‌ (15) స్థానికంగా ఉన్న శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్నాడు.


శుక్రవారం అరవింద్‌, అతడి తండ్రి మొదటి టర్మ్‌ ఫీజు కట్టేందుకు కళాశాలకు వెళ్లినప్పుడు.. చాలామంది సెకండ్‌ టర్మ్‌ కూడా కట్టేశారని, మీరు ఇంకా మొదటి టర్మ్‌ ఫీజే కట్టలేదని సిబ్బంది అనడంతో వారు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. శుక్రవారం రాత్రి ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో అరవింద్‌ ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.


ఇవి కూడా చదవండి...

వైసీపీ నేతలకు కోట్ల విలువైన భూముల అప్పగింత.. డిప్యూటీ కలెక్టర్‌పై కేసు

మహిళా ఎస్‌ఐపై అసభ్య ప్రవర్తన.. వైసీపీ నేత కోసం పోలీసుల గాలింపు

Read Latest AP News And Telugu News


నోట్: ఇలాంటి మానసిక ఒత్తిళ్లు, కుటుంబ సమస్యలతో బాధపడేవారు విలువైన ప్రాణాలు తీసుకోవద్దు.. మానసికంగా ఏమైనా సమస్యలు ఉంటే ఉచిత హెల్ప్‌లైన్ నెంబర్ ఐకాల్ 022-25521111కు ఫోన్ చేసి.. సలహాలు, సహాయం పొందవచ్చు.

Updated Date - Aug 08 , 2026 | 12:13 PM