కాకినాడలో దారుణం.. ఆటో సీటు చింపేశాడని కొడుకుకు వాతలు పెట్టిన సైకో తండ్రి
ABN , Publish Date - Apr 04 , 2026 | 06:24 PM
తండ్రి అంటే బిడ్డకు రక్షణగా ఉండాలి. కానీ, ఓ కన్నతండ్రి తన కొడుకు చేసిన చిన్న పొరపాటు చూసి కోపంతో ఊగిపోతూ చిత్రహింసలకు గురిచేశాడు. ఆటో సీట్ కవర్ చింపాడన్న కోపంతో కన్నకొడుకు అని కూడా చూడకుండా ఇనుప చువ్వలు, అట్లకాడతో ఒళ్ళంతా వాతలు పెట్టాడు. ఈ ఘటన ప్రత్తిపాడు మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
కాకినాడ, ఏప్రిల్4: తండ్రి అంటే బిడ్డకు రక్షణగా ఉండాలి. కానీ, ఓ కన్నతండ్రి తన కొడుకు చేసిన చిన్న పొరపాటు చూసి కోపంతో ఊగిపోతూ చిత్రహింసలకు గురిచేశాడు. ఆటో సీట్ కవర్ చింపాడన్న కోపంతో కన్నకొడుకు అని కూడా చూడకుండా ఇనుప చువ్వలు, అట్లకాడతో ఒళ్ళంతా వాతలు పెట్టాడు. ఈ ఘటన ప్రత్తిపాడు మండలంలో జరిగింది. ప్రతిపాడు మండలం వామ్మంగి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వృత్తిరిత్యా ఆటో డ్రైవర్. ఆయనకు ఏడేళ్ల కొడుకు ఉన్నాడు. ఆ బాలుడు ఆడుకుంటూ తెలియక ఆటో సీటు కవర్‌ను చింపేశాడు. దీన్ని చూసి కోపంతో ఊగిపోయిన తండ్రి.. విచక్షణ కోల్పోయి చిన్న పిల్లాడని చూడకుండా ఇంట్లో ఉన్న అట్లకాడ, ఇనుప చువ్వను వేడి చేసి బాలుడి ముఖం, కాళ్లు, చేతులు, శరీర భాగాలపై వాతలు పెట్టాడు.
బాలుడి కేకలు విన్న కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని తండ్రి బారి నుంచి రక్షించి వెంటనే ప్రత్తిపాడు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చిన్నారి పరిస్థితి చూసి అంతా కన్నీరు పెట్టుకున్నారు. చిన్న కారణంతో కన్న కొడుకును ఇంత దారుణంగా చిత్ర హింసలకు గురిచేసిన సైకో తండ్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తు్న్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి
అమరావతికి చట్టబద్ధత.. ఎన్నారై నేత శ్రీకాంత్ దొడ్డపనేని ఆధ్వర్యంలో సంబరాలు
మధ్యాహ్న భోజనంపై విద్యార్థులు సంతృప్తిగా ఉన్నారు: మంత్రి కొల్లు రవీంద్ర