అమరావతికి చట్టబద్ధత.. ఎన్నారై నేత శ్రీకాంత్ దొడ్డపనేని ఆధ్వర్యంలో సంబరాలు
ABN , Publish Date - Apr 04 , 2026 | 05:33 PM
అమెరికాలోని బే ఏరియాలో ఎన్నారై టీడీపీ నేతలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. కాలిఫోర్నియాలోని బే ఏరియాలో ఉన్న డబ్లిన్, ప్లజెంటన్ నగరాల్లో ఎన్నారై టీడీపీ నేత శ్రీకాంత్ దొడ్డపనేని ఆధ్వర్యంలో ఈ సంబరాలు అంబరాన్నంటాయి.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును రాజ్యసభలోనూ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఇక, లాంఛనంగా రాష్ట్రపతి ఆమోద ముద్ర లభిస్తే ఏపీకి అమరావతి శాశ్వత రాజధానిగా చరిత్రలో నిలిచిపోతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవిదేశాల్లో ఉన్న ఎన్నారైలు సంబరాలు జరుపుకుంటున్నారు. తాజాగా అమెరికాలోని బే ఏరియాలో ఎన్నారై టీడీపీ నేతలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. కాలిఫోర్నియాలోని బే ఏరియాలో ఉన్న డబ్లిన్, ప్లజెంటన్ నగరాల్లో ఎన్నారై టీడీపీ నేత శ్రీకాంత్ దొడ్డపనేని ఆధ్వర్యంలో ఈ సంబరాలు అంబరాన్నంటాయి. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ల పిలుపు మేరకు వీధుల్లోకి వచ్చి దీపాలు వెలిగించి తమ హర్షం వ్యక్తం చేశామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారై టీడీపీ నేతలు భక్త బల్ల, సుభా యంత్ర, వెంకట్ అడుసుమిల్లి, సత్యం పసల, కరీం, ప్రసాద్ బండారు, వెంకట్ గుడాల, జగదీష్ తాల్లూరి, భీమ్ బొమ్మ, శ్రీనివాస్ వీరమాచినేని, రవి మేడెపూడి, వంశీ కట్ట, మధు కట్ట, కిషోర్ బుద్ధ, సురేష్ నల్లపాటి, రాజేష్ నల్లూరి, భాను బిరుదురాజు, ప్రదీప్ నర్రా, నిఖిల్ దాది, సుధీర్ ఉన్నం, కరీమ్, ప్రేమ్ మక్కెన, సునీల్ సుదనగుంట పాల్గొన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్‌కు చరిత్రాత్మక ఘట్టమని, ప్రతి ఆంధ్రుడికి ఇది గర్వకారణమని వారు అన్నారు. ఇది తెలుగు ప్రజల విజయమని, దేవతల రాజధాని అమరావతికి భగవంతుడి మద్దతు ఉందని, దాని ఎదుగుదలను ఎవ్వరూ ఆపలేరని చెప్పారు.
ఈ వార్తలూ చదవండి:
అమరావతికి చట్టబద్ధత.. మెల్బోర్న్‌లో ఎన్నారైల హర్షాతిరేకాలు
సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ