అమరావతికి చట్టబద్ధత.. మెల్బోర్న్‌లో ఎన్నారైల హర్షాతిరేకాలు
ABN , Publish Date - Apr 04 , 2026 | 05:04 PM
అమరావతికి చట్టబద్ధత లభించిన నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో తెలుగుదేశం పార్టీ మెంబర్స్ అందరూ సమావేశమై తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
అమరావతికి చట్టబద్ధత లభించిన నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో తెలుగుదేశం పార్టీ మెంబర్స్ అందరూ సమావేశమై తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఏపీఎన్‌ఆర్టీ చైర్మన్ రవి వేమూరు ఆదేశాల మేరకు జరిగిన ఈ సమావేశంలో ఎన్నారైలు అమరావతి కోసం కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్, కూటమి ముఖ్య సభ్యులు పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.
అమరావతి కల నెరవేర్చినందుకు, కష్టపడి బిల్లు పెట్టి అసెంబ్లీలో బిల్లు తీర్మానం చేసి పార్లమెంట్‌కు పంపి అక్కడ బిల్లుని చట్టబద్ధత కల్పించేలా కృషి చేసిన మంత్రి నారా లోకేష్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఏపీ సీఎం చేతుల్లో ఆంధ్రప్రదేశ్ దినదినాభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నామని అన్నారు.
ఇలాంటి గవర్నమెంటు ఉంటే తదుపరి 10 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ ఇంకా చాలా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఒకే రాజధాని ఒకే నినాదం అనే భావనకు అనుగుణంగా ఏపీ ప్రజలకు అమరావతి శాశ్వత రాజధాని అయినందుకు, మెల్బోర్న్ మెంబర్స్ అందరూ చాలా ఆనందం వ్యక్తపరిచడంతో అక్కడ పండగ వాతావరణం కనిపించింది.
ఈ కార్యక్రమంలో సుబ్బారావు లగడపాటి, గోపి నంబాల, సంతోష్ కొల్లిపర, వంశీ తూమాటి, ఏడుకొండలు, అరవింద్, రవీంద్ర, వేమూరి వంశీ, వెంకట్ వట్టిరాజు, నర్మదా జొన్నలగడ్డ, మహీధర్, జనసేన సభ్యులు కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ వార్తలూ చదవండి:
అట్లాంటాలో ‘తానా’ మరో కార్యక్రమం.. సీపీఆర్‌పై శిక్షణ
సొంత ఊరిలో స్మశానం నిర్మాణం.. ఎన్నారై దాతృత్వం