సింగపూర్ కలలు.. విషపు కొండల నిజాలు.. అమరావతికి జవహర్ నగర్ గుణపాఠం అవుతుందా?
ABN , Publish Date - Apr 26 , 2026 | 11:14 AM
అభివృద్ధి చెందిన దేశాల స్థాయికి ఎదగాలనే ఆకాంక్ష ఒకవైపు.. కనీస వ్యర్థాల నిర్వహణ లేక విషతుల్యమవుతున్న నగరాలు మరోవైపు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చెత్త నిర్వహణ పెను ముప్పుగా పరిణమించిందిని 'ఏబీఎన్-ఆంధ్రజ్యోతి' డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి అన్నారు.
ఆంధ్రజ్యోతి, ఏప్రిల్ 26: అభివృద్ధి చెందిన దేశాల స్థాయికి ఎదగాలనే ఆకాంక్ష ఒకవైపు.. కనీస వ్యర్థాల నిర్వహణ లేక విషతుల్యమవుతున్న నగరాలు మరోవైపు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చెత్త నిర్వహణ అనేది కేవలం పర్యావరణ సమస్యగా కాకుండా.. పెను ముప్పుగా పరిణమించిందిని 'ఏబీఎన్-ఆంధ్రజ్యోతి' డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి అన్నారు.
తాజా గణాంకాల ప్రకారం.. హైదరాబాద్‌లోని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఇప్పుడు ప్రపంచంలోనే నాల్గో అత్యంత కలుషితమైన ప్రాంతంగా నిలిచింది. ఇక్కడ పేరుకుపోయిన లక్షల టన్నుల చెత్త నుంచి వెలువడుతున్న మీథేన్ వాయువు, విషపూరిత ద్రవాలు భూగర్భ జలాలు, గాలిని పూర్తిగా కలుషితం చేశాయి. ఇది ఓ విషపు కొండగా మారి.. పరిసర ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది.
మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని సింగపూర్ తరహాలో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. సింగపూర్ తన చెత్తను ఎలా నిర్వహిస్తుందో గమనించడం చాలా ముఖ్యమని 'ఏబీఎన్-ఆంధ్రజ్యోతి' డైరెక్టర్ ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ నాయకుల మధ్య విభేదాలు.. లీక్ అయిన రహస్య లేఖలో ఏముంది..
నా ఇంట్లోనే నన్ను గుండాతో కొట్టించారు.. కేజ్రీవాల్‌పై ఎంపీ స్వాతి సంచలన ఆరోపణలు..