Share News

బెజవాడ మేయర్‌ అభ్యర్థిగా వంగవీటి రాధా

ABN , Publish Date - Oct 18 , 2026 | 03:35 AM

మున్సిపల్‌ కార్పొరేషన్లు, నగరపాలక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలకు జనసేన పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. విజయవాడ కార్పొరేషన్‌ మేయర్‌ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ, ఏలూరు మేయర్‌ స్థానం నుంచి రెడ్డి అప్పలనాయుడును అభ్యర్థులుగా ఖరారు చేశారు.

బెజవాడ మేయర్‌ అభ్యర్థిగా వంగవీటి రాధా

  • ఏలూరు నుంచి రెడ్డి అప్పలనాయుడు పోటీ

  • ‘స్థానిక’ అభ్యర్థులను ఖరారు చేసిన జనసేన

అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ కార్పొరేషన్లు, నగరపాలక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలకు జనసేన పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. విజయవాడ కార్పొరేషన్‌ మేయర్‌ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ, ఏలూరు మేయర్‌ స్థానం నుంచి రెడ్డి అప్పలనాయుడును అభ్యర్థులుగా ఖరారు చేశారు. మున్సిపాలిటీల్లో అమలాపురం నుంచి నల్లా శ్రీధర్‌, చిలకలూరిపేట స్థానంలో తోట రాజరాజేశ్వరి, గొల్లప్రోలు నుంచి కడారి తమ్మయ్య నాయుడు, నరసాపురంలో కొత్తపల్లి శైలజ, నిడదవోలు స్థానంలో కల్లం జ్యోతి, పెడన నుంచి బళ్లా జ్ఞానలింగ జ్యోతి,, పిఠాపురంలో దానం లాజర్‌ బాబు, పుత్తూరు నుంచి డి. ఏలుమలై, సాలూరు స్థానంలో గొర్రె విజయకుమారి, సామర్లకోటలో పిట్టా జానకీరామారావు, తెనాలి నుంచి తోటకూర వెంకట రమణారావు, తిరువూరులో పి. మాధవిలు పోటీ చేయనున్నారు. అలాగే, దర్శి నుంచి దారం సుబ్బారావు, పుట్టపర్తిలో మేకల ఈశ్వర్‌, పాలకొండ నుంచి పల్లా విజయ నిర్మల, మడకశిరలో ఎస్‌. శ్రీనివాసరావులను చైర్మన్‌ అభ్యర్థులుగా ప్రకటించింది.

బీజేపీ అభ్యర్థులు వీరే..

రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి కూటమి మిత్రపక్షం బీజేపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు 5 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. అనంతపురం మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ అభ్యర్థిగా కోట్ల అజేశ్‌ బాబు, యలమంచిలి మునిసిపాలిటీ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా పిల్లా రమా కుమారి, గూడూరు(కె): దామం సునీతా బాయి, నెల్లిమర్ల: మైపాడ ప్రసాద్‌, గిద్దలూరు: డాక్టర్‌ జాది వెంకట నారాయణ, ఎర్రగుంట్ల: గొర్ల మధులతలను ఖరారు చేసినట్టు పేర్కొన్నారు.


వైసీపీ మరో జాబితా

పలు మునిసిపాలిటీలకు వైసీపీ చైర్మన్‌ అభ్యర్ధులను ఖరారు చేస్తూ మరో జాబితాను విడుదల చేసింది. తాడిపత్రి నుంచి ఫయాజ్‌బాషా, ధర్మవరం నుంచి కాచెర్ల అంజనేయు లు, కదిరి స్థానంలో అత్తార్‌ పర్విన్‌, నగరి మునిసిపాలిటీ చైర్మన్‌ అభ్యర్థిగా ఈవీ బాలకృష్ణన్‌, నెల్లిమర్ల నుంచి సముద్రపు రామారావు, ఆకివీడు నుంచి ఎం. లలితాదేవి, తిరువూరు నుంచి పి. శ్రీనివాసరావు, దాచేపల్లి మునిసిపల్‌ స్థానం నుంచి కొప్పుల రవికుమార్‌ పోటీ చేయనున్నారు.

దేశ రాజకీయాల్లో జగన్‌ రేర్‌ పీస్‌: సోమిరెడ్డి

దేశ రాజకీయాల్లో జగన్‌ అత్యంత రేర్‌ పీస్‌ అని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. సీబీఐ, ఈడీ కి సమయం చాలనంతగా అనేక కేసుల్లో నిందితుడిగా జగన్‌ రికార్డు సృష్టించారన్నారు. కల్తీ నెయ్యితో తిరుమల ప్రసాదాన్ని అపవిత్రం చేసిన పాపం జగన్‌దేనని, ఈడీ విచారణతో గుట్టు బయటపడుతోందన్నారు. చిత్తశుద్ధి ఉంటే కేసుల విచారణ పూర్తయ్యే వరకూ రాజకీయాలకు దూరంగా ఉండాలన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

జగన్ ఆదేశాల మేరకే పులివెందులలో వైసీపీ అరాచకం: టీడీపీ నేతలు

దసరా స్పెషల్ ట్రైన్లు.. ఛార్జీల పెంపుపై దక్షిణ మధ్య రైల్వే క్లారిటీ

Updated Date - Oct 18 , 2026 | 03:35 AM