విజయం వరించినా విధి వంచించింది..
ABN , Publish Date - Nov 08 , 2026 | 04:23 AM
తన కష్టానికి తగ్గ ఫలితం వచ్చే ముందు ఆమెను విధి వంచించింది. ఎంపీటీసీగా తన విజయా న్ని ఆస్వాదించకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయింది.
ఎంపీటీసీగా గారపాటి దివ్య గెలుపు
పోలింగ్ తర్వాత కన్నుమూసిన జనసేన అభ్యర్థి
దేవరపల్లి, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): తన కష్టానికి తగ్గ ఫలితం వచ్చే ముందు ఆమెను విధి వంచించింది. ఎంపీటీసీగా తన విజయా న్ని ఆస్వాదించకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయింది. చిన్న వయసులోనే భౌతికంగా దూరమైన ఆమెను తలుచుకుంటూ కుటుంబసభ్యులు, గ్రామస్థులు, జనసేన నాయకులు, కార్యకర్తలు కన్నీటిపర్యంతం అవుతున్నారు. ఈ విషాద ఘటన వివరాలు.. జనసేన నుంచి ఎంపీటీసీ అభ్యర్థిగా గారపాటి దివ్య (26) తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ధుమంతునిగూడెంలో పోటీ చేశారు.
ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. పోలింగ్ రోజున తన భర్త శ్రీనివాస్‌తో కలిసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉత్సాహంగా ఊరంతా తిరిగారు. ఉన్నట్టుండి సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. తొలుత ఆమెను దేవరపల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి రాజమహేంద్రవరం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఆమె కన్నుమూశారు. అయితే శనివారం జరిగిన ఎన్నికల కౌంటింగ్‌లో దివ్య విజయం సాధించారు. సమీప వైసీపీ ప్రత్యర్థి గెంజి ధనలక్ష్మిపై 368 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తాము గెలిపించుకున్న దివ్య హఠాన్మరణం చెందడంతో ధుమంతునిగూడెంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
ఫలించిన మంత్రి కొండపల్లి వ్యూహం.. బొత్స కూతురిపై సామాన్య మహిళ గెలుపు..