Share News

కూటమిలో కొనసాగడానికి జనసేన, బీజేపీకి సిగ్గుండాలి

ABN , Publish Date - Sep 11 , 2026 | 05:55 AM

డీఎస్సీలో తవ్వేకొద్దీ అక్రమాలు బయటపడుతున్నా కూటమిలో కొనసాగడానికి జనసేన, బీజేపీకి సిగ్గుండాలని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ విమర్శించారు.

కూటమిలో కొనసాగడానికి జనసేన, బీజేపీకి సిగ్గుండాలి
YS Jagan

  • చంద్రబాబు అరాచకాల వల్లే నాలాంటోళ్లూ కాక్రోచ్‌లుగా మారుతున్నారు

  • డీఎస్సీపై సీబీఐ విచారణ చేయించాలి.. లోకేశ్‌ రాజీనామా చేయాలి: జగన్‌

అమరావతి, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): డీఎస్సీలో తవ్వేకొద్దీ అక్రమాలు బయటపడుతున్నా కూటమిలో కొనసాగడానికి జనసేన, బీజేపీకి సిగ్గుండాలని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ విమర్శించారు. సీఎం చంద్రబాబు చేస్తున్న అరాచకాల వల్లే తనలాంటోళ్లూ కాక్రోచ్‌లుగా మారుతున్నారని అన్నారు. గురువారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎంపిక చేసుకున్న మీడియా సంస్థల విలేకరులు, మరికొందరు ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ తన పదవికి రాజీనామా చేయాలన్నారు.


డీఎస్సీలోని అక్రమాలపై తాను ఆధారాలతో సహా చూపిస్తుంటే చంద్రబాబు, లోకేశ్‌ సమాధానం చెప్పడం లేదని, అధికారులతో మాట్లాడిస్తున్నారని అన్నారు. ఢిల్లీలోనే గాక ప్రతి వేదిక మీద ప్రశ్నిస్తామని చెప్పారు. మెరిట్‌ విద్యార్థుల కోసమే న్యాయస్థానంలో కేసులు వేస్తున్నామన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా జరిగిందని చెప్పారు. గ్రామ సచివాలయాల ఉద్యోగాల భర్తీ సమయంలో పార్టీలు చూడలేదన్నారు. చంద్రబాబు, లోకేశ్‌ రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారని ఆరోపించారు. డీఎస్సీలో అక్రమాలపై ఆధారాలను చూపిస్తుంటే వారిద్దరికీ బీపీ పెరిగిపోతోందన్నారు. కూటమి ప్రభుత్వం నిర్వహించింది మెగా డీఎస్సీ కాదని, దగా డీఎస్సీ అని విమర్శించారు.


పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగులోకి తీసుకురావడంతో ఏపీపీఎస్సీలోనూ స్పోర్ట్స్‌ కోటా కింద ఉద్యోగాల భర్తీ పేరిట చేయాలనుకున్న స్కామ్‌ను ఆపేశారన్నారు. మే 18న ఏపీపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్‌లో 40 పోస్టులను స్పోర్ట్స్‌ కోటా కింద రాతపరీక్ష లేకుండానే భర్తీచేయాలని చంద్రబాబు చూశారన్నారు. డీఎస్సీలోని అక్రమాలనే అటవీ శాఖలోనూ కొనసాగించాలనుకున్నారని ఆరోపించారు. డీఎస్సీ స్కామ్‌ బయటపడటంతో స్పోర్ట్స్‌ కోటా కింద 40 పోస్టులతో పాటు మిగిలిన 774 పోస్టుల భర్తీని అటవీశాఖలో రద్దు చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సీఎంగా చంద్రబాబు చేసిన స్కామ్‌లకు క్లీన్‌ చిట్‌ ఎక్కడా రాలేదని అన్నారు. 2024లో అధికారంలోకి వచ్చాక తన కింద పనిచేసే పోలీసు అధికారుల ద్వారా కేసులు కొట్టేసేలా చేసుకున్నారని ఆరోపించారు.


ఈ వార్తలు కూడా చదవండి..
వరుస సెలవులతో రైళ్లన్నీ కిటకిట
ఏపీ పర్యాటకానికి కేంద్రం సహకారం
Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 11 , 2026 | 05:55 AM