ఏపీ పర్యాటకానికి కేంద్రం సహకారం
ABN , Publish Date - Sep 11 , 2026 | 05:48 AM
వికసిత్ భారత్‌లో పర్యాటక రంగమే ప్రధానపాత్ర పోషిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఏపీలో పర్యాటకానికి కేంద్రం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందని చెప్పారు.
ఐఏటీఓ జాతీయ సదస్సులో రామ్మోహన్‌నాయుడు
6 అంచెల విధానంలో ఏపీ టూరిజం అభివృద్ధి: దుర్గేశ్
విశాఖపట్నం, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): వికసిత్ భారత్‌లో పర్యాటక రంగమే ప్రధానపాత్ర పోషిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఏపీలో పర్యాటకానికి కేంద్రం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందని చెప్పారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (ఐఏటీఓ) 41వ జాతీయ సదస్సును గురువారం విశాఖపట్నం నోవోటెల్ హోటల్‌లో రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేశ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, పర్యాటక ప్రాంతాలకు విమాన సర్వీసులు పెంచుతామన్నారు.
ఉత్తరాంధ్రకు మరింత ప్రాచుర్యం కల్పించాలని టూర్ ఆపరేటర్లను కోరారు. ఉడాన్ పథకాన్ని వంద విమానాశ్రయాలకు అనుసంధానం చేసి రూ. 28,840 కోట్లు వెచ్చిస్తున్నామని, ఇది పర్యాటక రంగం అభివృద్ధికి ఉపయోగపడుతుందని చెప్పారు. మంత్రి కందుల దుర్గేశ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ఆరు అంచెల విధానంలో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గడచిన రెండేళ్లలో రాష్ట్రానికి రూ.20 వేల కోట్ల పర్యాటక పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వెల్‌నెస్, ఎకో, అడ్వంచర్, హెలీ, సీప్లేన్ టూరిజం వంటివి వేగవంతం చేశామన్నారు.
గోదావరి పుష్కరాల సందర్భంగా ఏడు ప్రత్యేక పర్యాటక సర్క్యూట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పర్యాటక వనరులు, ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, మౌలిక వసతుల వివరాలను ఏపీ పర్యాటకశాఖ ప్రధాన కార్యదర్శి ఎస్.ఎ్‌స.రావత్ వివరించారు. ఈ కార్యక్రమంలో గోదావరి పుష్కరాల విశిష్ఠతను తెలియజేస్తూ ‘ది గోదావరి కాల్స్’ పోస్టర్‌ను మంత్రులు ఆవిష్కరించారు. ఐఏటీఓ మాన్యువల్ బుక్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో ఛత్తీ్‌సగఢ్ టీడీసీ చైర్మన్ నీలూ శర్మ, ఏపీటీడీసీ ఎండీ రవి సుభాష్, విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వరుస సెలవులతో రైళ్లన్నీ కిటకిట
విజయవాడ, హైదరాబాద్, రాజమండ్రి నుంచి తిరుపతికి విమానాలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News