Share News

బలమైన అభ్యర్థులను ఎంపిక చేయండి

ABN , Publish Date - Sep 25 , 2026 | 04:01 AM

స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు.. భవిష్యత్‌లో వచ్చే సార్వత్రిక ఎన్నికలకు గీటురాయి కావాలని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ అన్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ తరఫున బలమైన, మంచి అభ్యర్థులను ఎన్నికల్లో నిలబెట్టాలని స్పష్టంచేశారు.

బలమైన అభ్యర్థులను ఎంపిక చేయండి

  • స్థానిక ఎన్నికల్లో గట్టిగా పోరాడాలి: జగన్‌

అమరావతి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు.. భవిష్యత్‌లో వచ్చే సార్వత్రిక ఎన్నికలకు గీటురాయి కావాలని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ అన్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ తరఫున బలమైన, మంచి అభ్యర్థులను ఎన్నికల్లో నిలబెట్టాలని స్పష్టంచేశారు. గురువారం తాడేపల్లి ప్యాలెస్‌లో పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఎన్నికల్లో గట్టిగా పోరాడాలన్నారు. పార్టీలో పలు దఫాలుగా నాయకులందరితో మాట్లాడాకే తుది జాబితాను తయారు చేయాలని సూచించారు. పోలీసు బలంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో అడ్డదారులు తొక్కుతారని.. ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సిద్ధం కావాలన్నారు. సమావేశంలో ప్రాంతీయ సమన్వయకర్తలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్‌, బూడి ముత్యాలనాయుడుతో పాటు రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, రాష్ట్రంలో కరువు పరిస్థితులపై చర్చించేందుకు సీపీఐ ఆధ్వర్యంలో శనివారం జరిగే రౌండ్‌టేబుల్‌ సమావేశానికి రావాలని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ జగన్‌ను ఆహ్వానించారు. రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య, జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హరనాథరెడ్డిలతో ఆయన తాడేపల్లి ప్యాలెస్‌లో జగన్‌ను కలిశారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలపై మాట్లాడారు.

ఈ వార్తలనూ చదవండి...

సన్నాలకు రికార్డు ధర

పీజీ కోర్సుల్లో చేరేవారేరి?

Updated Date - Sep 25 , 2026 | 04:01 AM