ఒకే వార్డుకు భార్యాభర్తల పోటీ
ABN , Publish Date - Nov 29 , 2026 | 03:49 AM
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం పెదకాపవరం పంచాయతీ ఎన్నికల్లో వింత పరిణామం చోటుచేసుకుంది. 12వ వార్డు జనరల్ అవ్వడంతో..
ఆకివీడు రూరల్, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం పెదకాపవరం పంచాయతీ ఎన్నికల్లో వింత పరిణామం చోటుచేసుకుంది. 12వ వార్డు జనరల్ అవ్వడంతో.. అక్కడ మాజీ ఉపసర్పంచ్ పాతపాటి పద్మావతి, ఆమె భర్త శ్రీనివాసరాజులు బరిలో నిలిచారు. భర్తకు డమ్మీగా పద్మావతి నామినేషన్ వేశారు. అయితే నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ తర్వాత కూడా వీరిద్దరూ పోటీలో ఉండడం గమనార్హం. పద్మావతికి ఎన్నికల గుర్తుగా గౌను, శ్రీనివాసరాజుకు మోకాళ్ల పీట కేటాయించారు. అనివార్య కారణాలు వలన తన భార్య నామినేషన్ ఉపసంహరణ కాలేదని, తనకు కేటాయించిన గుర్తుపైనే ప్రచారం నిర్వహించి, ఎన్నికలకు వెళ్తామని శ్రీనివాసరాజు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్ చెక్..