Share News

హిందూపురం కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ శ్రేణుల హల్‌చల్

ABN , Publish Date - Nov 07 , 2026 | 12:59 PM

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సుమారు 200 మంది కార్యకర్తలతో వైసీపీ నాయకుడు వేణు రెడ్డి దూసుకురావడంతో గందరగోళం నెలకొంది.

హిందూపురం కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ శ్రేణుల హల్‌చల్
Hindupur Counting Centre

శ్రీ సత్యసాయి, నవంబర్ 7: జిల్లాలోని హిందూపురంలోని మహిళా పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సుమారు 200 మంది కార్యకర్తలతో వైసీపీ నాయకుడు వేణు రెడ్డి కౌంటింగ్ కేంద్రం వద్దకు దూసుకురావడంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ క్రమంలో వైసీపీ శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ విధులకు ఆటంకం కలిగించేలా వ్యవహరించినట్లు సమాచారం. భద్రతా సిబ్బంది హెచ్చరికలు చేసిననా కార్యకర్తలు వెనక్కి తగ్గకుండా గందరగోళం సృష్టించారు.


దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగిన వైసీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. ఒక్కసారిగా చోటుచేసుకున్న ఈ పరిణామాలతో కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

ఆ వార్డుల్లో రీపోలింగ్‌కు ఆదేశించలేం

అత్తాపూర్‌లో బైక్‌ను ఢీకొట్టిన వాహనం.. ఒకరికి తీవ్ర గాయాలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 07 , 2026 | 01:49 PM